BigTV English

Stranger Things Season 5 : ఇండియాలో ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ ఓటీటీ రిలీజ్ డేట్… కానీ చిన్న ట్విస్ట్

Stranger Things Season 5 : ఇండియాలో ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ ఓటీటీ రిలీజ్ డేట్… కానీ చిన్న ట్విస్ట్

Stranger Things Season 5 : పాపులర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things Season 5) చివరి సీజన్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 4 సీజన్లు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మోస్ట్ అవెయిటింగ్ సీజన్ 5 ఇండియాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? ఎన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి? వాటి టైటిల్స్ ఏంటి? అనే వివరాలు తాజాగా వెళ్లడయ్యాయి.


ఇండియాలో ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ స్ట్రీమింగ్

ఈ ఏడాది ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’తో ఈ సిరీస్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాము అని డఫర్ బ్రదర్స్ వెల్లడించారు. ఇండియాలో ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో 2025 అక్టోబర్ 10న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రిలీజ్ కాబోతోంది. అయితే అందులో ఆరు ఎపిసోడ్లు మాత్రమే అక్టోబర్లో రిలీజ్ కాబోతున్నాయి.


చివరి రెండు ఎపిసోడ్లు నవంబర్ 27న నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్ వండర్ గా ఉండబోతున్న ఈ సిరీస్ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ తో పాటు ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో సీజన్ 5 చివరిది కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేయడంతో, చివరి సీజన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.

సీజన్ 5లో మిల్లీ బాబీ బ్రౌన్, వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాటరాజ్జో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నౌ, సాడీ సింక్ తో పాటు మరికొంత మంది కొత్త నటీనటులు కన్పించబోతున్నారు. నెల్ ఫిషర్, జేక్ కాన్నెల్లీ, అలెక్స్ బ్రూక్స్, లిండా హామిల్టన్ తదితరులు ఆ లిస్ట్ లో ఉన్నారు.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ టైటిల్స్
1. ది క్రాల్
2. ది వానిషింగ్ ఆఫ్…
3. ది టర్న్‌బో ట్రాప్
4. సోర్సెరర్
5. షాక్ జాక్
6. ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్జ్
7. ది బ్రిడ్జ్
8. ది రైట్‌సైడ్ అప్

‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 ఎపిసోడ్ టైటిల్స్

సైన్స్ ఫిక్షన్ హర్రర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్‌లో మాక్స్ పాత్ర పోషించి, పాపులర్ అయిన సాడీ సింక్ (Sadie Sink) ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ నటితో మేకర్స్  ‘స్పైడర్ మ్యాన్ 4’లో నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ పాత్రలో టామ్ హాలండ్ మరోసారి నటిస్తున్నారు.

హాలీవుడ్ మీడియా ప్రకారం, సాడీ సింక్ ‘స్పైడర్ మ్యాన్ 4’లో కీలక పాత్ర పోషించనుంది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని అమీ పాస్కల్, కెవిన్ ఫీజ్ నిర్మించారు. అయితే ఇప్పటి వరకు మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సాడీ సింక్ మూవీలో భాగం కాబోతోందని వస్తున్న వార్తలపై స్పందించలేదు.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×