E-Paper
Advertisement

చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!

చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!
Advertisement

Adivi Shesh:టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Shesh) ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరొకవైపు రష్మిక తో ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, నిర్మాతలు కథానాయిక కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవలే రాహుల్ రవీంద్రన్ కథను కూడా అడివి శేష్ ఆమోదించారని, వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సింగర్ చిన్మయితో చేసే సినిమా టైటిల్ అదే..

అయితే ఈ వార్తలను నిజం చేస్తూ రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ జంటగా.. జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ జంటగా కనిపించడంతో ఇక వీరిద్దరూ కొత్త ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు అనే రూమర్స్ కి బలం చేకూరింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. రాహుల్ రవీంద్రన్ తో జగపతిబాబు మాట్లాడుతూ..” మీ భార్య, ప్రముఖ సింగర్ చిన్మయితో మీరు సినిమా చేయాలనుకుంటే.. ఏ టైటిల్ పెడతారు?” అని ప్రశ్నించగా.. దీనికి అడివి శేష్ స్పందిస్తూ.. “కాబోయే పద్మశ్రీ” అంటూ టైటిల్ చెప్పి అందరిని నవ్వించారు. మొత్తానికి అయితే చిన్మయితో సినిమా చేయాల్సి వస్తే.. ఆ సినిమాకు ఇలాంటి టైటిల్ పెడతారు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ లో అడివి శేష్ ఫస్ట్ క్రష్..

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. అందంగా ఉన్నావు.. స్మార్ట్ గా ఉన్నావు.. తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. మరి తెలుగు ఇండస్ట్రీలో నీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని జగపతిబాబు ప్రశ్నించగా.. రాహుల్ మాట్లాడుతూ..” ఒకటా , రెండా, మూడా ఎన్నున్నాయి..” అంటూ పెద్ద లిస్ట్ చెప్పసాగాడు. ఇక రాహుల్ మాటలను బట్టి చూస్తే అడివి శేష్ కి ఇండస్ట్రీలో చాలామందితో క్రష్ ఉన్నట్లు తెలుస్తోంది. అడివి శేష్ అని కొట్టి టాప్ లిస్ట్ అని ఒకటి కొట్టాను. అందులో వచ్చిన లిస్టు చూసి భయపడిపోయాను. మళ్లీ చెక్ చేయలేదు అంటూ అడివి శేష్ కామెంట్ చేశారు.

also read: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

అదే అసలైన ప్రేమ..

Advertisement

అలాగే పార్ట్నర్ తో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి ? అని ప్రశ్నించగా.. జంతువైనా సరే.. మనిషైనా సరే మనకి కావలసినట్టుగా అవతల వాళ్ళు మనల్ని ప్రేమిస్తేనే మనం దానిని ప్రేమగా ఫీల్ అవుతాము.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.. మొత్తానికైతే అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో సాగిన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

Related News

సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్

హౌస్ లో గొడవపడ్డ ఆర్కే- రామ్ ప్రసాద్.. అసలేం జరుగుతోంది?

చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!

యాంకర్ సౌమ్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? పాప రిచ్..

Karthika Deepam 2 Serial Today Episode November 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను ఇంట్లోంచి గెంటేసిన సుమిత్ర

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు టెన్షన్.. చందు సీరియస్.. రామరాజుది ఎంత గొప్ప మనసో కదా..

Big Stories

Advertisement
×