Shakeel Kavitha: మళ్ళీ బోధన్‌లో షకీల్ యక్టీవ్ పాలిటిక్స్ మీడియా సమావేశం నిర్వహించారు. కల్వకుంట్ల కవితపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా ఈయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందిరాగాంధీ లాంటి మహానేతలే ఎన్నికల్లో ఓడిపోయారని, కవిత ఎంత?” అంటూ షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రిజర్వేషన్ వస్తే నా భార్య ఆయేషా ఫాతిమాను ఎన్నికల్లో నిలబెడతానని షకీల్ అన్నారు. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు.. సై అంటే సై అంటూ షకీల్ సవాల్ విసిరారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చుట్టూ దెయ్యాలు, బ్రోకర్లు చేరారని సంచలన ఆరోపణలు షకీల్ చేశారు. కవిత వద్ద పనిచేసే పీఏలే పెద్ద బ్రోకర్లుగా మారారని విమర్శలు చేసారు.
గతంలో కవితను కలవాలంటే పీఏలకు డబ్బులు, బహుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు కవితకు కూడా తెలియకపోవచ్చని షకీల్ అభిప్రాయం పడుతున్నారు. బోధన్ ప్రజలు మరో కొత్త నాయకురాలిని కోరుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. కవితపై షకీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
Also Read: మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్