Superman OTT: ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు నాలుగు వారాలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అయిన చిత్రాలు మాత్రమే ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ సడెన్ గా ఎంట్రీ ఇచ్చేసింది.. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ మూవీ సూపర్ మ్యాన్.. హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన మూవీ కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.. అయితే తాజాగా ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసిందో చూడాలి…
సూపర్ మ్యాన్ ఓటీటీ..
హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్.. జూలై11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. డేవిడ్ కోరెన్‌స్వెట్ కొత్త సూపర్‌మ్యాన్‌గా నటించిన ఈ సినిమాకు సూసైడ్ స్క్వౌడ్, గార్డయన్స్ ఆఫ్ ది గెలాక్సీల చిత్రాల డైరెక్టర్ జేమ్స్ గన్ గత సినిమాలకు భిన్నంగా సరికొత్తగా ఈ మూవీని రూపొందించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి ఎటువంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా వచ్చేసింది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఏకంగా రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే యాపిల్ ప్లస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అక్కడ మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read : ఈ హీరోలు ఒకే ఫ్యామిలీ.. కానీ, తల్లులు వేరు వేరు…
స్టోరీ విషయానికొస్తే..
బొరావియా అనే దేశం పక్కనే ఉండే జర్హాన్‌పూర్‌పై దాడి చేయకుండా సూపర్‌మ్యాన్ ఆపేస్తాడు. కానీ అక్కడి హ్యామర్ ఆఫ్ బొరావియా అనే మెటాహ్యూమన్ చేతిలో ఓడిపోతాడు. తన కుక్క సాయంలో వేరొక ప్రదేశానికి వెళ్లి మళ్లీ మామూలు మనిషి అవుతాడు. ఈ క్రమంలో హ్యామర్ అసలు లూథర్ సృష్టించిన అల్ట్రామ్యాన్ అని తెలుస్తుంది. అయితే లూథర్ సూపర్ మ్యాన్ తండ్రి క్రిప్టాన్ పంపిన ఓ మేసేజ్‌ను మరో రకంగా ప్రజల ముందుకు తీసుకు వచ్చి సూపర్‌మ్యాన్‌ను ప్రపంచాన్ని కాపాడటానికి కాదు, నాశనం చెయ్యడానికి అని ప్రచారం చేస్తాడు. దాంతో అక్కడ మొత్తం సూపర్ మ్యాన్ కు వ్యతిరేకంగా మారతారు. లూథర్ కొత్తగా సృష్టించిన పాకెట్ యూనివర్స్‌లో సూపర్‌మ్యాన్‌ను బంధిస్తాడు. కఠినమైన ప్రాంతం నుంచి అతని ఎలా బయటపడ్డాడు అన్నది సినిమా స్టోరీ లో చూడాలి. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ స్టోరీ ఉండడంతో భారీగా కలెక్షన్లు కూడా వసూలు చేసింది. అక్కడ సక్సెస్ స్టాప్ ని అందుకున్న ఏ మూవీ ఓటీటీలో ఏ రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి..