Black Tomatoes: మనందరికీ తెలిసిన టమోటాలు ఎరుపు రంగులో ఉంటాయి. కానీ ప్రకృతిలో అరుదుగా దొరికే ఒక ప్రత్యేకమైన రకం ఉంది అదే నల్ల టమాటాలు. వీటిని బ్లాక్ టమాటోస్ లేదా ఇండిగో రోజ్ టమాటోస్ అని కూడా అంటారు. ఈ టమోటాలకు నల్లటి, ఊదా రంగు ఉంటుంది. సాధారణ టమోటాలతో పోలిస్తే వీటిలో కొన్ని ప్రత్యేకమైన పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు ఇస్తాయి. నల్ల టమోటాల్లో యాంటోసైనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇదే పదార్థం బ్లాక్‌బెర్రీ వంటి పండ్లలో కూడా ఉంటుంది. ఈ యాంటోసైనిన్ శక్తివంతమైన ప్రతి ఆక్సీకరణ పదార్థం. ఇది మన శరీరంలోని హానికరమైన కణాలను, ప్రోటీన్లు, DNAలను దెబ్బతీయకుండా తొలగించి, కణాలను రక్షిస్తుంది. దీని వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉండదు.
అంతేకాదు ఇది గుండెకు ఆరోగ్యం కూడా. నల్ల టమోటాలు గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న యాంటోసైనిన్, లైకోపీన్ రక్తనాళాలను శుభ్రపరచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో బీపీ, హార్ట్ అటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది తింటే మధుమేహం నియంత్రిస్తుంది. పరిశోధనలు చెబుతున్నట్లు, నల్ల టమోటాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని ఆహారంలో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ స్థాయి స్థిరంగా ఉంచుకోవచ్చు.
Also Read: Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..
నల్ల టమాటా చర్మానికి సహజ కవచం. వీటిలో విటమిన్ C, యాంటోసైనిన్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వయసు ముందే ముడతలు పడకుండా కాపాడుతుంది. అలానే సూర్యకిరణాల వల్ల వచ్చే దెబ్బతినే ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. ఇది కళ్ళకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. నల్ల టమోటాలలో విటమిన్ A, కరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వయస్సు పెరిగిన తర్వాత వచ్చే కంటి సమస్యలు రావడం నుంచి రక్షిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరగడం. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీరం రోగాలను ఎదుర్కునే శక్తిని పెంచుతుంది. సీజనల్ జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ఇంకా, నల్ల టమోటాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో మంచిది. నల్ల టమోటాలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని సలాడ్‌లలో, జ్యూస్‌లలో లేదా కూరగాయలలో వాడుకోవచ్చు.
సాధారణంగా మనం ఎర్ర టమోటాలు మాత్రమే తింటాం. కానీ నల్ల టమోటాలు దొరికితే తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కేన్సర్ నివారణ నుంచి గుండె ఆరోగ్యం వరకు, చర్మ కాంతి నుంచి కంటి చూపు వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. సహజంగా లభించే ఈ వరాన్ని వాడుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.