BigTV English

Telugu Actors : ఈ హీరోలు ఒకే ఫ్యామిలీ.. కానీ, తల్లులు వేరు వేరు…

Telugu Actors : ఈ హీరోలు ఒకే ఫ్యామిలీ.. కానీ, తల్లులు వేరు వేరు…

Telugu Actors : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో ఇద్దరు భార్యలతో కూడా వాళ్లకు పిల్లలున్నారు. అలాంటప్పుడు తండ్రి ఒక్కడే అయినా, తల్లి మాత్రం వేరుగా ఉన్నారు. అయినా.. ఆ పిల్లాలు చాలా అన్యోయంగా ఉండటం మనం చూస్తుంటాం. మామూలుగా చెప్పాలంటే ఇలాంటి కాంబినేషన్లు కేవలం సినిమాల్లో కనిపించేవి. కానీ ఈ మధ్య రియల్ లైఫ్ లో కూడా కనిపించడంతో అభిమానులు కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సినిమా వాళ్ళకి ఇది కామన్ అని సరిపెట్టుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరు? ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వాళ్ల పిల్లల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


మహేష్ బాబు- నరేష్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ప్రస్తుతమైన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య దివంగత ఇందిరా కొడుకు మహేష్ బాబు అయితే.. రెండో భార్య దివంగత విజయనిర్మల కుమారుడు నరేష్.. వీళ్ళ తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్క ఒక్కరే.. ఈ ఇద్దరు హీరోలు అయ్యారు. తర్వాత నరేష్ ఇప్పుడు హీరో, హీరోయిన్ తండ్రి పాత్రలు చేస్తున్నాడు. అలాగే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.


ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హరికృష్ణ.. ఎన్నో సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన భౌతికంగా మన మధ్య లేరు. అయితే ఈయన కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. హరికృష్ణ మొదటి భార్యకు కళ్యాణ్ రామ్, జానకీ రామ్ కొడుకులు అయితే.. రెండో భార్యకు ఎన్టీఆర్ జన్మించాడు. వీరిద్దరూ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

మంచు లక్ష్మి- మనోజ్..

టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈయన ఎన్నో వందల సినిమాల్లో నటించాడు. విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. మొదటి భార్య పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి.. రెండో భార్య కుమారుడు మంచు మనోజ్.. వీరందరూ కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో మంచు మనోజ్, లక్ష్మీ ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.

అఖిల్-నాగ చైతన్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఈయన అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి భార్య లక్ష్మీకి నాగ చైతన్య జన్మించాడు. రెండో భార్య అమలకు అఖిల్ పుట్టాడు. వీళ్లిద్దరు టాలీవుడ్‌లో హీరోలుగా సత్తా చూపెడుతున్నారు..

Also Read: నర్మదకు అడ్డంగా దొరికిపోయిన భాగ్యం.. శ్రీవల్లి పని అయిపోయినట్లే.. రామరాజు షాకింగ్ డెసిషన్..?

కేవలం హీరోలు మాత్రమే కాదు అటు హీరోయిన్లు కూడా తండ్రి ఒకరు తల్లులు వేరుగా ఉన్నారు. శ్రీదేవి , నగ్మా కూడా ఓకే తండ్రికి పుట్టారు.. కానీ తల్లులు వేరు. వీళ్ళే కాదు ఇంకా చాలామంది హీరోయిన్లు హీరోలు కూడా ఉన్నారు..

Related News

Samantha New Pics : బీ టౌన్‌కు వెళ్లావా.. బీ గ్రేడ్‌కు వెళ్లావా… సమంత ఏంటా ఫోజులు ?

Nandamuri Padmaja : ముగిసిన పద్మజా అంత్యక్రియలు.. వదినకు కొడుకులా మారిన బాలయ్య!

Nara Rohith: నేను ‘వార్‌ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mahesh Babu: ఛారిటీ కోసం ప్రతి ఏడాది మహేష్ ఎన్ని కోట్లు డొనేట్ చేస్తారో తెలుసా?

Nara Rohith: నా ఇంటి పేరే నాకు సమస్య… నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు!

Naga Chaitanya: దేవర డైరెక్టర్‌తో కాదు కానీ.. దేవర నిర్మాతలతో నాగచైతన్య మూవీ ?

Big Stories

×