Surya Best Movies on OTT : సూర్య ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. తమిళ నటుడు అయినటువంటి సూర్యకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన నటనతో అలరిస్తున్న సూర్య, నిజ జీవితంలో కూడా ఎటువంటి మచ్చ లేకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ ని కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన కొన్ని సినిమాలు గురించి చెప్పుకుందాం.
గజిని (Gajini)
సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూర్య కెరీర్ లోనే భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సంజయ్ రామస్వామి క్యారెక్టర్ లో సూర్య జీవించాడనే చెప్పాలి. రిచ్ పర్సన్ అయిన సంజయ్ రామస్వామి, ఒక సాధారణమైన అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. తన ప్రేమ గురించి ఆమెకు చెప్పబోయేలోగా, విలన్ జరిపిన దాడిలో హీరోయిన్ చనిపోగా, హీరోకి మెమరీ లాస్ వస్తుంది. ఆ షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ తోనే విలన్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్ (mx player) లో స్ట్రీమింగ్ అవుతుంది.
సింగం (Singam)
సూర్య, అనుష్క, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య జీవించాడనే చెప్పాలి. రాజకీయ పలుకుబడి, గుండాయిజం చూపించి ఇల్లీగల్ పనులు చేసే అక్రమార్కులను, పోలీస్ ఆఫీసర్ అయిన సూర్య ఎలా ఎదుర్కొన్నాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్ (mx player) లో స్ట్రీమింగ్ అవుతోంది.
పితామగన్ (Pitamagan)
ఈ మూవీలో విక్రమ్, సూర్య, లైలా, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి బాల దర్శకత్వం వహించారు. విక్రమ్ సూర్యల స్నేహబంధం చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఈ మూవీ విక్రమ్ కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో, సూర్యకి కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ హంగామా (Hangama) లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆకాశం నీ హద్దురా (Aakasham Ne Haddura)
సూర్య, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లు నటించినఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సూర్య కెరీర్ లో మంచి మూవీ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక సాధారణ వ్యక్తి విమాన ప్రయాణాన్ని పేదవాళ్లకు సులభతరంగా తీసుకురావడానికి ప్రయత్నించే స్టోరీతో మూవీ నడుస్తుంది. ఈ మూవీలో సూర్య నటన వర్ణించలేనిది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో ఈ సినిమాలను మీకు నచ్చిన వాళ్ళతో కలసి చూసి ఎంజాయ్ చేయండి.