Satyabhama Today Episode November 25 th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాదేవయ్య రెండో పెళ్ళాం అంటూ కొత్త క్యారక్టర్ గంగ ఇంట్లో అడుగు పెడుతుంది. భైరవి పెనిమిటి నిజంగానే నీకు చిన్న ఇల్లు ఉందా? నాకు తెలియకుండా ఏదైనా దాస్తున్నావా అని అంటుంది. అంతలోకే అక్కడికి పంకజం వస్తుంది. అమ్మ కొడుకులు కలిసి ఇంత ముచ్చట పెట్టుకుంటున్నారంటే ఏదో మంచి ముచ్చటే పెట్టుకున్నారని పంకజం అంటుంది. నువ్వేందే నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు అని క్రిష్ అంటాడు. క్రిష్ నా బిడ్డ కదా మరి వీళ్ళకి ఎందుకు నిజం చెప్పలేదు అనేసి అడుగుతుంది. ఇక గంగను బయటకు గెంటేస్తే బయట కూర్చొని నా బిడ్డకు నాకు చెయ్యండి అని సోకాలు పాడుతుంది .. ఆ బండోడిని ఎలాగైనా నా దారికి తెచ్చుకుంటాను అని అంటుంది. ఇక మహాదేవయ్య అనుచరులు కూడా ఇక్కడి నుంచి పో అమ్మా మా అయ్య గురించి నీకు తెలియదు చంపేస్తాడు అని అంటారు. మీ అయ్యగారు గురించి నాకు బాగా తెలుసు. నా పక్కలో ఎలా ఉంటాడో తెలుసా అని పంచాయితీ పెడుతుంది. అందరు గంగది తప్పులేదని సమర్దిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గంగను సపోర్ట్ చేసేందుకు మహిళా సంఘాలు కూడా ముందుకు వస్తాయి. గంటలు గడిచే కొద్ది గంగకు సపోర్ట్ పెరుగుతుంది. ఇక ఇంట్లో మహాదేవయ్య మీద భైరవికి అనుమానం మొదలవుతుంది.. నిజంగానే పెనిమిటి ఏది చేయకుంటే ఈమె ఎవరో ఎందుకు అలా అంటుంది అని ఆలోచిస్తుంది. జయమ్మను కూడా పిలిచి మీ అబ్బాయికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కదా. ముందు నుంచే ఈ అలవాట్లు ఉన్నాయి. కానీ దాచిపెట్టి నా గొంతుకోశారు కదా అత్తమ్మ అని భైరవి అడుగుతుంది. దానికి జయమ్మ సోఫాలో కూర్చొని నిద్ర పోయే అలవాటు లేదు. ఇప్పుడు వచ్చినట్లు ఉంది. అని అంటుంది. ఇక సత్య రేణుకలు అత్తయ్య బాధను చూసి జాలి పడతారు. ఎలాగైనా మీకు న్యాయం జరిగేలా చూస్తామని అంటారు. నా నీడలో ఉన్నప్పుడు ఇలాంటి అలవాట్లు లేవు. అనగానే ఏందీ అత్తమ్మ నేను మీ అబ్బాయిని చెడగొట్టానా అని భైరవి అడుగుతుంది.
ఇక గంగ విషయాన్ని నరసింహకు లీక్ చేస్తుంది సత్య.. మీడియాకు కూడా చెప్పు మహాదేవయ్య రెండో భార్య వచ్చింది అని ఇంఫర్మేషన్ ఇవ్వగానే మీడియా వాళ్ళు అక్కడకు చేరుకొని అసలు నిజాలు తెలుసుకోవాలని మహాదేవయ్యకు నిజంగానే రెండో భార్య ఉందా? ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు? రాజకీయాలకు అడ్డుగా ఉందని అనుకున్నారా. మరేదైనా కారణాల వల్ల దాచి పెట్టాడా? ఇంతకీ ఈ గంగ ఎవరు ఆ బిడ్డ మీ బిడ్డేనా అని మీడియాలో వార్తలు ఊపందుకుంటాయి. సత్య గంగ దగ్గరకు వచ్చి మామయ్య బిడ్డలను మారుస్తావని అనుకున్నా కానీ నువ్వు ఏకంగా సెకండ్ సెటప్ పెట్టావా? క్రిష్ గురించి నిజం వెతికే పనిలో ఉంటే ఆవిడ నా బిడ్డ అంటుంది.
నేను ఇక్కడ నుంచి వెళ్లాలంటే నా బిడ్డను నాకు ఇవ్వు లేదా తాళి కట్టావుగా ఉంచుకో అని గంగ తగ్గకుండా రెచ్చిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మహాదేవయ్యను అనుమానిస్తున్నారు. ఆ విషయం పై పెద్ద డిష్కర్శన్ పెట్టేస్తారు. మహాదేవయ్య తెలుసుకొని భైరవిని తిడతాడు.
ఇక గంగ విషయాన్ని నరసింహకు చెప్పాలి అని సత్య అనుకుంటుంది. అతనికి ఎవరో తెలియని వాళ్ళు అన్నట్లు ఫోన్ చేసి నిజం చెప్తుంది. మొదట అతను కూడా నమ్మడు. రాక్షసుడు అని చెప్పు నమ్ముతాను. రెండో పెళ్ళాం అంటే నమ్మను అని అంటాడు. కావాలంటే ఇంటికి వచ్చి చూడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అతను మీడియకు ఈ విషయాన్ని లీక్ చేస్తాడు. గంగకు మద్దతుగా నరసింహ కూడా వస్తాడు. మహాదేవయ్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఉండాలని మీడియాతో మాట్లాడతారు. ఇక సత్య ఇది కదా నాకు కావాల్సింది అని అనుకుంటుంది. గంగను రెచ్చగొడుతుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో డీఎన్ఏ టెస్ట్ కు సత్య ఒప్పుకోమని చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..