OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో అడ్వెంచర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్లదాకా చూసి ఎంజాయ్ చేసే ఒక అడ్వెంచర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియొ
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “స్లేవ్ ఆఫ్ ది క్యానిబల్ గాడ్” (Slave of The Canibel God). ఒక దీవిలో చిక్కుకుపోయిన తన భర్త కోసం భార్య అతన్ని కాపాడడానికి చేసే ప్రయత్నంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ కు సైంటిస్ట్ అయిన తన భర్త ఒక దీవికి వెళ్లి కనిపించకుండా పోతాడు. హీరోయిన్ ప్రభుత్వ సహాయాన్ని కోరుతుంది. అన్ని విధాలుగా ప్రయత్నించి ఆచూకీ దొరకలేదని చావు కబురు చల్లగా చెప్తుంది ప్రభుత్వం. చేసేదేం లేక హీరోయిన్ భర్తను వెతకడానికి రంగం లోకి దిగుతుంది. తన తమ్ముడితో కలిసి, మరొక సైంటిస్ట్ సాయం తీసుకొని భర్తను వెతకడానికి ప్రయత్నిస్తుంది. అయితే సదరు సైంటిస్ట్ మీ భర్త ప్రభుత్వం వెతుకుతున్న చోటు లేడని, మరొక దీవిలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తాడు. అది నిషేధించబడినది కావడంతో ఎవరూ అక్కడికి పోవడానికి సాహసించరని చెప్తాడు. హీరోయిన్ డబ్బుతో కొంతమంది వ్యక్తులను కొని ఆ దీవికి వెళ్తుంది. తీసుకెళ్లిన మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోతూ ఉంటారు. చివరికి వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలి ఉంటారు. ఆ దీవిలో ఒక పర్యాటకుడు వీళ్లకు పరిచయం అవుతాడు. అతడు అక్కడే నివసిస్తున్న కొంతమంది తెగ దగ్గరికి వీళ్ళను తీసుకువెళ్తాడు. హీరోయిన్ వాళ్లను సమాచారం అడుగగా, నీ భర్త వేరొక తెగకు దొరికి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ తెగ నరమాంస భక్షకులు అని, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగిరారని వీళ్లను హెచ్చరిస్తారు. అయినా తన భర్త కోసం నేను వెళ్తానని హీరోయిన్ చెప్తుంది.
ఆమె పడుతున్న బాధకు పర్యాటకుడు కూడా సాయం చేస్తానని వస్తాడు. కొంత దూరం వెళ్లిన వీళ్లకు ఒక మిషన్ కనబడుతుంది. ఆ మిషన్ చూసి హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఆమె వచ్చింది భర్త కోసం కాదు. యురేనియం నిక్షేపాలను కనుగొనే యంత్రం కోసం. అక్కడ నిక్షేపాలు ఉన్నాయని సైంటిస్ట్ హీరోయిన్ కి సమాచారం ఇచ్చి ఉంటాడు. అయితే అతడు మిస్ అవ్వడంతో ఎలాగైనా ఆ అ నిక్షేపాలను కనుక్కొని డబ్బు సంపాదించాలని హీరోయిన్ భావిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పర్యాటకుడు ఆమెను అసహ్యించుకొని అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే నరమాంస భక్షకులు ఆ ప్రాంతాన్ని చుట్టి ముట్టి ఉంటారు. వీళ్లను బందీలుగా చేసుకొని హీరోయిన్ తమ్మున్ని పీక్కు తింటారు. చివరికి వీళ్లను కూడా తినడానికి సిద్ధమవుటారు. అప్పుడు వీళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి? చివరికి ఆ దివి నుంచి వీళ్ళు బయటపడతారా? హీరోయిన్ కు తన భర్త కనిపిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అడ్వెంచర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.