OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు మంచి ఫీలింగ్ ని ఇస్తాయి. అటువంటి సినిమాలను వినోదం కోసం చూడకపోయినా, కథలో ఉండే కంటెంట్ కోసమైనా చూడాలి. ఇటువంటి సినిమాలు అరుదుగానే వస్తుంటాయి. మనసుకు మంచి ఫీలింగ్ ఇచ్చే ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో
ఈ ఫీల్ గుడ్ కన్నడ మూవీ పేరు ‘స్వాతి ముత్తిన మలే హని‘ (Swathi muthina male haniye). ఈ మూవీలో ఒక్కరోజులో చనిపోయే వ్యక్తి మీద ప్రేమ పెంచుకునే ఒక లేడి డాక్టర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ ఫీల్ గుడ్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ప్రేరణ ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ, పేషెంట్స్ ను మంచిగా చూసుకుంటుంది. ఎందుకంటే ఈమె డాక్టర్ గా పనిచేసే హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ కు అన్ని దారులు మూసుకుపోయి వస్తారు. అలా వచ్చిన వాళ్లకి ఈ డాక్టర్ మోటివేషన్ చేస్తూ ఉంటుంది. నెల రోజులు కూడా బతకలేని పేషెంట్స్ తో కాలం వెళ్లబుచ్చుతూ ఉంటుంది ప్రేరణ. అక్కడ పనిచేసే వాచ్ మ్యాన్ కూడా పేషెంట్స్ అలా చనిపోతుంటే తాగుడికి బానిస అవుతాడు. భర్త వేరొక మహిళతో సన్నిహితంగా ఉండటంతో బాధపడుతూ ఉంటుంది ప్రేరణ. ఒకరోజు ప్రేరణ ఇంటికి తల్లి వస్తుంది. భార్య భర్తలు మాట్లాడుకునే మాటల్లో, వీరి మధ్య దూరం బాగా ఉందని తెలుసుకుంటుంది. అన్నీ సర్దుకుంటాయి అని ప్రేరణకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే ప్రేరణ పనిచేసే హాస్పిటల్ కి అంకిత్ అనే పేషంట్ వస్తాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని హాస్పిటల్ ఎం.డి చెప్తాడు. ఆ పేషెంట్ తో మాట్లాడుతూ ఉండటంతో, ప్రేరణకి ఎందుకో తెలియని ఫీలింగ్ వస్తుంది.
అంకిత్ మీద ప్రేమ పెంచుకుంటూ, అతనితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. ఇక చనిపోతాడు అనే సమయంలో, ఒకరోజు రాత్రి అతని దగ్గర బెడ్ పై పడుకుని నిద్రిస్తుంది. అతడు అనాధ అని తెలుసుకుని బాధపడుతుంది. చనిపోయాక బాడీని ఏం చేయాలని అడుగుతుంది. అలా వీళ్లు మాట్లాడుకుంటున్న సమయంలోనే అతడు చనిపోతాడు. అంకిత్ చనిపోవడంతో చాలా బాధపడుతుంది ప్రేరణ. చివరికి ప్రేరణ, అంకిత్ నుంచి ఏం తెలుసుకుంటుంది? భర్తలో దొరకని ప్రేమ చనిపోయే వ్యక్తిలో దొరికిందా?భర్త వేరొకరితో సంబంధం ఎందుకు పెట్టుకుంటాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్వాతి ముత్తిన మలే హని’ (Swathi muthina male haniye) అనే ఈ ఫీల్ గుడ్ మూవీని మిస్ కాకుండా చూడండి.