BigTV English

OTT Movie : భార్య మీద అనుమానంతో ఫోన్ హ్యాక్ చేసే భర్త… మరి భార్య ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : భార్య మీద అనుమానంతో ఫోన్ హ్యాక్ చేసే భర్త… మరి భార్య ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : మలయాళం సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి డిమాండ్ ఉంది. మంచి కథలను తెరమీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మలయాళం దర్శకులు. వీటిలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అయితే గత ఏడాది వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అతో ముగమ్‘ (Atho Mugam). ఈ మూవీలో భార్య మీద ప్రేమతో, ఆమె చేసే పనులను తెలుసుకోవడానికి ఒక యాప్ ని ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తాడు భర్త. ఆ తర్వాత పరిణామాలు చాలా ట్విస్ట్ లతో ముందుకు వెళ్తాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మార్టిన్, లీనా భార్య భర్తలు హ్యాపీగా సంసారాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే భార్య భర్త పుట్టినరోజు చాలా సర్ప్రైజ్ గా సెలబ్రేట్ చేస్తుంది. అలాగే భర్త కూడా తన భార్యను సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇంట్లో ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టి, ఆమెను కనుక్కోమంటాడు. భార్య చాలా తొందరగా ఆ గిఫ్ట్ ను కనుక్కుంటుంది. ఒక రోజంతా ప్లాన్ చేసి దాచిపెడితే ఒక్క క్షణంలో ఆమె ఎలా కనుక్కుంది అని భర్త చాలా ఆశ్చర్యపోతాడు. ఆ మరుసటి రోజు భార్య ఫోన్ లో, హిడెన్ కెమెరా యాప్ ఇన్స్టాల్ చేస్తాడు. ఆమె పాటలు పాడుతూ వంట చేస్తుంటే ఆనందపడుతూ ఉంటాడు. అయితే మధ్యలోనే ఒక వ్యక్తి ఆ ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయం లీనా భర్తకి చెప్పదు. దీంతో అనుమానం వచ్చిన భర్త, భార్యపై ఒకన్ను వేస్తాడు. కెమెరాలో నీ భర్తను చంపేసి నాతో వచ్చేయ్ అని ఒక వ్యక్తి మాట్లాడుతాడు. ఈ మాటలు విన్న భర్త ఒక్కసారిగా షాక్ అవుతాడు. భార్యని ఫాలో అవుతూ ఒకచోటికి వెళ్తాడు.

అక్కడ సూర్య అనే వ్యక్తి నీ భర్తను చంపేస్తే ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. ఇంతలోనే లీనా గన్ తీసుకొని అతన్ని షూట్ చేస్తుంది. ఇది కళ్ళారా చూస్తున్న భర్త ఒక్కసారిగా మళ్లీ షాక్ అవుతాడు. ఆ శవాన్ని ఎలా మాయం చేయాలి అని లీనా ఆలోచిస్తుండగా, ఆమె  ముందుకు భర్త వస్తాడు. భర్త రావడంతో భార్య కంగారుపడి బాధపడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని భర్త భార్యని అడుగుతాడు. అప్పుడు భార్య, భర్తకి ఒక వీడియో చూపిస్తుంది. అందులో భర్త వేరొక అమ్మాయితో క్లోజ్ గా ఉండటం రికార్డు అయి ఉంటుంది. ఈ వీడియొ చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తుంది. చివరికి లీనా ఆ ఉచ్చులో నుంచి బయటికి వస్తుందా? భర్తని చంపాలని చూస్తున్నది ఎవరు? భార్య దగ్గర ఉన్న వీడియోలో ఏముంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనీ మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×