BigTV English

Game Changer Collections : మూడో రోజు కలెక్షన్ల ఊచకోత.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్..

Game Changer Collections : మూడో రోజు కలెక్షన్ల ఊచకోత.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్..

Game Changer Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కీయరా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్.. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఫస్ట్ షోకే మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ ను దున్నెస్తుంది. మొదటి రోజు అందరికి షాక్ ఇస్తూ ఏకంగా 186 కోట్లు వసూల్ చేసి రికార్డును బ్రేక్ చేసింది. అదే విధంగా రెండో రోజు కూడా బాగానే కలెక్షన్స్ ను అందుకుంది. ఇక మూడో రోజు ఈ మూవీ పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మూడో రోజు ఎన్ని కోట్లు రాబాట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.


గేమ్ ఛేంజర్ కలెక్షన్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రం తొలి రోజు రూ.186 కోట్ల గ్రాస్ సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో రెండో రోజు రూ.84 కోట్లు వచ్చినట్టు అయింది. ఈ లెక్కల ప్రకారం తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో ఏకంగా రూ.102 కోట్ల డ్రాప్ కనిస్తోంది. రెండు రోజుల మధ్య సగానికి పైగా కలెక్షన్లలో డ్రాప్ ఉంది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్ల లెక్కల్లో భారీ తేడా ఉంది.. ఇక మూడో రోజు చూస్తే రూ. 330 కోట్లు వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. అంటే 60 కోట్లు మాత్రమే రాబట్టింది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ కలెక్షన్స్ బాగా తగ్గాయనే టాక్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు అనుమానం కలిస్తుంది.. మూడో రోజు కలెక్షన్స్ పై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.


మూవీ స్టోరీ విషయానికోస్తే.. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ చిత్రంలో రామ్‍చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కొత్తగా లేదంటూ మిక్స్డ్ టాక్ వచ్చింది. అంచనాలను తగ్గట్టుగా లేదనే కామెంట్లు వినిపించాయి. అయితే, చరణ్ స్టార్ డమ్‍తో ఈ మూవీకి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు.. టాక్ తో సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్దదూసుకుపోతుంది. ఇక 500 కోట్లకి పైగా వసూల్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఐఏఎస్ రామ్‍నందన్, అప్పన్న క్యారెక్టర్లను పోషించారు. అప్పన్న పాత్ర కాసేపే ఉన్నా చెర్రీ తన పర్ఫార్మెన్సుతో మెప్పించారు. ఈ చిత్రంలో కియారా అడ్వానీ, అంజలి కూడా కీలకపాత్రలు పోషించారు. ఎస్‍జే సూర్య విలన్‍గా నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీరోల్స్ చేశారు. థమన్ సంగీతాన్ని అందించారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×