OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే ఎన్ని సినిమాలు చూసినా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ ప్రత్యేకంగా వుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘స్వీట్ నవంబర్‘ (Sweet November). ఈ మూవీలో జాబ్ పోయిన ఒక అబ్బాయి, నెల రోజుల్లో చనిపోయే ఒక అమ్మాయితో లవ్ లో పడితే ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. స్వీట్ నవంబర్ మూవీకి పాట్ ఓకానర్ దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ డ్రామా మూవీలో కీను రీవ్స్, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
నెల్సన్ ఒక అడ్వర్టైజ్ కంపెనీలో నిరంతరం రెస్ట్ లేకుండా పనిచేస్తుంటాడు. తనకంటూ సమయం కేటాయించకుండా, ఎప్పుడు పనిలోనే నిమగ్నమై ఉంటాడు. అయితే ఒకరోజు నెల్సన్ చేసిన ఒక ప్రాజెక్ట్ నచ్చలేదని కొంతమంది చెప్పడంతో, వాళ్లతో గొడవ పెట్టుకుంటాడు. ఈ గోడవతో అతనికి ఉద్యోగం కూడా పోతుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నెల్సన్ వెళ్తాడు. అక్కడ సారా అనే అమ్మాయి ఇతనికి పరిచయమవుతుంది. డ్రైవింగ్ ఎగ్జామ్ లో పక్క చైర్ లోనే కూర్చుని ఉండటంతో, సారా ని హెల్ప్ అడుగుతాడు నెల్సన్. ఇది చూసి ఆఫీసర్, సారా ని బయటికి పంపిస్తాడు. ఇలా వీళ్ళిద్దరికీ పరిచయం బాగా పెరుగుతుంది. సారా, నెల్సన్ తో మాట్లాడుతూ సరదాగా గడపాలనుకుంటుంది. ఈ క్రమంలోనే అతన్ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. నెల్సన్ ని చాలా బ్రతిమాలడంతో టీ తాగడానికి ఇంటికి వస్తానని ఒప్పుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ సరదాగా గడుపుతుంటారు.
ఆమె హ్యాబిట్స్, ప్రవర్తన చూసి నెల్సన్ సారా తో అట్రాక్ట్ అవుతాడు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలలోనే సారా ఆనందం వెతుక్కుంటూ ఉంటుంది. అయితే సారా టాబ్లెట్స్ వాడుతూ ఉంటుంది. ఇది ఎందుకు వాడుతుందో తెలుసుకున్న నెల్సన్ షాక్ అవుతాడు. ఆమె నెల రోజుల కన్నా ఎక్కువగా బ్రతకదు అని తెలిసి చాలా బాధపడతాడు. అప్పటినుంచి తనకు నచ్చినట్టు, తనని సంతోష పెడుతూ ఉంటాడు. చివరికి సారా చనిపోతుందా? సారా నుంచి నెల్సన్ నేర్చుకున్న దేమిటి? సారా కి వచ్చిన జబ్బు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.