Game Changer Budget Details : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకవైపు మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుంది. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీనే సంక్రాంతి హంగామా చేస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అయితే ఈ మూవీకి భారీ బడ్జెట్ ను పెట్టిన సంగతి తెలిసిందే.. సినిమా కలెక్షన్స్ పక్కన పెడితే అనవసరపు బడ్జెట్ పెట్టారంటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు రోజులకు ఎంత వసూల్ చేసిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గేమ్ ఛేంజర్ మూవీ..
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్.. కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.. బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మొదటి రోజు 186 కోట్లు, రెండో రోజు 270 కోట్లు, మూడోవ 330 కోట్లు రాబట్టింది. ఇక నాలుగో రోజు కూడా ఎక్కడా తగ్గకుండా వసూల్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..
గేమ్ చేంజర్ బడ్జెట్..
గ్లోబల్ స్టార్ రామ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 10 న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఓవర్ బడ్జెట్ పెట్టారనే టాక్ కూడా వినిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ బడ్జెట్ ను మంచి నీళ్లలాగ ఖర్చు చేయించారనే టాక్ మొదటి రోజు నుంచి వినిపిస్తుంది.. ఇప్పుడు బడ్జెట్ డీటెయిల్స్ చర్చనీయాంశంగా మారింది. మూవీకి 450 కోట్లు ఖర్చు అయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ బడ్జెట్ కు ఇంట్రెస్ట్ 100 కోట్లట.. మొదట 130 రోజులు అనుకున్నారట.. కానీ 350 రోజులు, 3 ఇయర్స్ షూటింగ్ పెరగడంతో ఇంట్రెస్ట్ కూడా పెరిగిందట. ఇంత బడ్జెట్ కు కారణం శంకర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న టైమ్ లో ఫినిష్ చేస్తే ఇంత బడ్జెట్ అవసరం ఉండేది కాదని అంటున్నారు. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే టీమ్ రెస్పాండ్ అవ్వాలి. ఏది ఏమైన మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. రామ్ చరణ్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ పడింది. ఈ మూవీ తర్వాత చెర్రీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. రెండు ప్రాజెక్టు లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు..