The Traitors Telugu trailer: ప్రముఖ సినీ నటుడు తేజ సజ్జ(Teja Sajja) హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త రియాలిటీ షో ” ది ట్రైటర్స్” (The Traitors)మొదటిసారి అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగులో ఈ రియాలిటీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ రియాలిటీ షో 10 ఎపిసోడ్లతో 20 మంది సెలబ్రిటీలతో ప్రారంభం కాబోతుంది. ఈ రియాలిటీ షో ఎవరిని నమ్మాలనే నేపథ్యంలో ఫలితాలను నిర్ణయిస్తుంది. అదేవిధంగా పొత్తులు, అనుమానాలు ద్రోహాల నేపథ్యంలో ఈ రియాలిటీ షో ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. మరి ఈ రియాలిటీ షోలో పాల్గొనబోతున్న ఆ 20 మంది కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే..
హర్షవర్ధన్ సినీ నటుడు రచయిత, సినీనటి ప్రగతి, ప్రముఖ యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహ, ఇషా వ్లాగ్స్ స్నో అక్క ఫేమ్ మౌనిష చౌదరి , లేడీ కమెడియన్ విధ్యులేఖ రామన్, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ,అభినవ కవి , ర్యాపర్ ప్రవణ్ చాగంటి , గేమర్ పుష్పాల ధనుంజయ్ , బిజినెస్మే రహత్ అచట, ప్రముఖ యూట్యూబ్ వర్ష డిసౌజా, కొరియోగ్రాఫర్ ఫల్గుణి, నటి ఆషికా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ స్వేకర్ అగస్తి, షోస్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్ధన్, ప్రముఖ సినీ నటుడు సాయి రోనక్, కంటెంట్ క్రియేటర్ గౌరవ్ సునీల్, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, కమెడియన్ విష్ణువు, ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద . ఈ 20 మంది కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
It’s time to say hi to players 👋 and goodbye to trust 🗡#TheTraitorsTeluguOnPrime, New Reality Series with New Episodes Every Thursday 12 PM, Oct 15@tejasajja123 pic.twitter.com/bYjdwUfwLr
— prime video IN (@PrimeVideoIN) October 6, 2026
తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ రియాలిటీ షో మొత్తం మానసికంగా ప్రయోజనం కలిగించే ఆటల గురించే తెలియజేస్తుంది ఇందులో పోటీదారులు, స్నేహాలు, పొత్తులు ఏర్పరచుకుంటూనే తమలో ఎవరు నిజమైన గుర్తింపును దాస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ద్రోహులు రహస్యంగా పనులు చేస్తూ ఉంటారు. రియాలిటీ షో కొనసాగుతున్న సమయంలో పోటీదారులు ఎవరిని నమ్మొచ్చు ఎవరిని తొలగించాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఈ ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలా ఈ కార్యక్రమాన్ని తెలుగులో మొదటి సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ రియాలిటీ షోపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీ ప్రారంభం కాక ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది.
Also Read: రీషూట్ చేయాల్సిందేనా? ఆదర్శ కుటుంబం వాయిదాకు ఇదే కారణమా?