Aadarsha Kutumbham Post Poned: విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. (Aadarsha kutumbam house no 47)త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్(Venkatesh) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎన్నో వాయిదాలు తర్వాత అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కానీ చివరికి యధావిధిగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ నాగ వంశీ తెలియజేశారు.
ఇలా ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ నుంచి వాయిదా వేస్తున్న విషయాన్ని ఈయన ప్రకటించడంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి గల కారణం గురించి నిర్మాతలు చెబుతూ పోస్ట్ ప్రొడక్షన్ వరకు పెండింగ్ లో ఉందని తెలిపారు. కానీ ఈ సినిమా వాయిదా వెనుక మరొక కారణం ఉందని తెలుస్తోంది. మరి ఆదర్శ కుటుంబం వాయిదా పడటానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే.. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా అవుట్ ఫుట్ సరిగా లేకపోవడంతోనే చిత్ర బృందం ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలు ఉన్నాయి వెంకటేష్ కు రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి అద్భుతమైన సినిమాలను అందించారు. ఇక దర్శకుడుగా త్రివిక్రమ్ వెంకటేష్ కి ఎలాంటి సినిమా ఇస్తారో అంటూ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం ప్రేక్షకులు అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయాయని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం అవుట్ ఫుట్ చూసుకొని చాలా డిసప్పాయింట్ అయ్యారట ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో డిసప్పాయింట్ అయినట్టు ఇండస్ట్రీ సమాచారం. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలా? రీషూట్ చేయని నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించి ఉన్న కంటెంట్ కాస్త బెటర్ గా మార్చాలా? అనే సందిగ్ధంలో చిత్ర బృందం ఉన్నారు. అయితే ప్రస్తుతం హీరో వెంకటేష్ అలాగే సురేష్ బాబు ఇద్దరూ కూడా విదేశాలలో ఉన్న నేపథ్యంలో వారు ఇండియా వచ్చిన తర్వాతనే వారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.ఇలా తరచూ ఈ సినిమాని వాయిదా వేస్తున్న నేపథ్యంలో వెంకటేష్ సైతం చిత్ర బృందం పై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది . తదుపరి ఈ సినిమా విడుదల అనేది పూర్తిగా వెంకటేష్ నిర్ణయం పైనే ఆధారపడి ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ సినిమా అక్టోబర్ లో కూడా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని చిత్ర బృందం భావిస్తున్నారు.
Also Read: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ చూశారా? నవ్వులే నవ్వులు!