E-Paper
Advertisement

తండ్రి కోసం కూతురు ఆడిన ఫేక్ పోలీస్ గేమ్… సీన్లోకి అసలు విలన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

తండ్రి కోసం కూతురు ఆడిన ఫేక్ పోలీస్ గేమ్… సీన్లోకి అసలు విలన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్
Advertisement

Thai Action Comedy Movie: క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్, ఊహించని ట్విస్టులు కామన్. కానీ ఒక నకిలీ పోలీస్ టీమ్ నిజమైన నేరగాళ్లను ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? పైగా ఆ టీమ్‌లో ఉన్నవాళ్లలో ఎవరికీ అసలు పోలీస్ డ్యూటీ గురించి తెలియకపోతే పరిస్థితి ఇంకెంత ఫన్నీగా మారుతుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థాయ్ యాక్షన్ కామెడీ మూవీనే ‘Overacting’. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో భారీ సక్సెస్ సాధించి, డిజిటల్ ఆడియన్స్‌ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ కోసం ఒక అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే గందరగోళం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే..

వినై అనే వ్యక్తి ఒకప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎంతో పేరున్న టాప్ ఆఫీసర్. ఎన్నో క్రిమినల్స్‌ను ఎదుర్కొన్న అనుభవం అతనికి ఉంది. అయితే రిటైర్మెంట్ తర్వాత వయసుతో పాటు జ్ఞాపకశక్తి కూడా అతడిని ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు తాను రిటైర్ అయ్యాననే విషయాన్ని మర్చిపోయి, ఇప్పటికీ పోలీస్ ఆఫీసర్‌గానే పనిచేస్తున్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ముఖ్యంగా గతంలో తనకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఒక క్రిమినల్ శత్రువుపై ఉన్న పాత పగ అతడిని వెంటాడుతూనే ఉంటుంది.

Advertisement

వినై కూతురు వోరానుచ్ ఒక నటిగా ఎదగాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ కెరీర్‌లో అనుకున్న స్థాయికి చేరుకోలేక ఇబ్బందులు పడుతుంటుంది. ఇలాంటి సమయంలో తండ్రి పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడుతుంది. తన తండ్రి ఇప్పటికీ పోలీస్ ఆఫీసర్ అనే నమ్మకంతోనే బతుకుతున్నాడని అర్థం చేసుకున్న ఆమె, అతడి ఆనందాన్ని దూరం చేయకూడదని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది.

వోరానుచ్ తన పాత చైల్డ్ ఆర్టిస్ట్ స్నేహితులను, తన మాజీ ప్రియుడు, ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న సార్జెంట్ టాయ్‌ను కూడా ఈ ప్లాన్‌లో భాగం చేస్తుంది. వీరంతా కలిసి ఒక ఫేక్ పోలీస్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. వినైకి నిజంగానే క్రైమ్ ఆపరేషన్లు జరుగుతున్నాయనే ఫీలింగ్ కలిగేలా నకిలీ కేసులు, ఫేక్ మిషన్లు క్రియేట్ చేస్తుంటారు.

Advertisement

మొదట్లో అంతా సరదాగా సాగిపోతుంది. తండ్రి ఆనందంగా ఉండటంతో కూతురు కూడా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ వీళ్లు చేస్తున్న నాటకం అనుకోకుండా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే వినై జీవితంలో గతంలో ఎదురైన అసలైన శత్రువు సువా హావో మళ్లీ రంగంలోకి దిగుతాడు. ఈసారి అతడు నిజంగానే నేరాలకు పాల్పడుతుంటాడు. దీంతో నకిలీ ఆపరేషన్లు చేస్తున్న ఈ గ్యాంగ్‌కు నిజమైన క్రిమినల్స్‌తో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఒకవైపు నిజమైన పోలీసుల కంటపడకుండా ఉండాలి. మరోవైపు ప్రమాదకరమైన విలన్ ఆట కట్టించాలి. ఇంకోవైపు తండ్రికి తమ అసలు విషయం తెలియకూడదు. ఇలా ఒక్కో సమస్య పెరుగుతున్న కొద్దీ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. చివరకు ఈ ఫేక్ పోలీస్ టీమ్ నిజమైన ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొందనేది సినిమాలో చూడాల్సిందే. ఇందులో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఆడియన్స్ చేత వావ్ అనిపిస్తుంది.

ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

‘Overacting’ సినిమా 2026 నవంబర్ 5 నుంచి Netflixలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఒరిజినల్ థాయ్ భాషలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. యాక్షన్ కామెడీ, స్లాప్‌స్టిక్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్. ఇందులో వినై పాత్రలో థాయ్ కామెడీ నటుడు టెంగ్ తెర్డ్ తెంగ్ (Teng Terd Terng), వోరానుచ్ పాత్రలో బో మేలడా సుస్రి (Bow Maylada Susri) నటించారు. సార్జెంట్ టాయ్‌గా కాంగ్ హువాయ్‌రాయ్ (Kong Huayrai), సువా హావోగా జోక్ గోర్న్‌పాప్ జంజారోయెన్ (Joke Gornpop Janjaroen) కనిపిస్తారు. ప్రూక్సా అమరుజి (Prueksa Amaruji) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రరుయెక్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Read Also: ట్విస్ట్ అంటే ఇదీ… మర్డర్ కేసు కోసం మగాడిగా మారే లేడీ డిటెక్టివ్… మతిపోగొట్టే మలుపులున్న కామెడీ సిరీస్

Tags

Related News

అఫీషియల్ జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే!

చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా

ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 9 తెలుగు సినిమాలు, సిరీస్ లు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

ఖైదీల వరుస మర్డర్స్… కనిపించని దెయ్యాన్ని పట్టుకోవడానికి తంటాలు… జైలు అంటేనే జడిపించే హారర్

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓవైపు… వెంటాడుతున్న కరడుగట్టిన క్రిమినల్ మరోవైపు… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×