E-Paper
Advertisement

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!

రూ.800లోపే గేమింగ్ ఇయర్‌బడ్స్..ఫీచర్లు మాములుగా లేవు!
Advertisement

HOPPUP Xo6:  గేమింగ్. మ్యూజిక్ లవర్స్ కోసం బడ్జెట్ ధరలో.. అద్భుతమైన గాడ్జెట్స్‌ను అందించడంలో హాప్అప్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు అదే.. కోవలో గేమర్స్‌ని ఫిదా చేసేలా.. మరో సంచలన ప్రొడక్ట్‌తో మన ముందుకు వచ్చింది. అదే హాప్అప్ Xo6 గేమింగ్ ఇయర్‌బడ్స్. కేవలం రూ 799 ధరకే లభిస్తున్న ఈ ఇయర్‌ బడ్స్, మార్కెట్‌లో ఉన్న ఇతర బడ్జెట్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆకర్షణీయమైన రెడ్ కలర్, ఆర్జీబీ లైట్లతో ఇవి చూడటానికి ఒక అల్ట్రా-మోడర్న్ గేమింగ్ డివైస్‌లా కనిపిస్తున్నాయి. మరి ఈ ఇయర్‌ బడ్స్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి, రూ.800 లోపు బడ్జెట్‌కి ఇవి ఎంతవరకు న్యాయం చేస్తాయనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్స్:

ఈ ఇయర్‌ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే..ప్రత్యేకించి గేమింగ్ లవర్స్‌ని టార్గెట్ చేసి దీన్ని రూపొందించారు. ఛార్జింగ్ కేస్, ఇయర్‌ బడ్స్‌పై ఉన్న ఆర్జీబీ ఎల్ఈడీ లైట్లు దీనికి ఒక అసలైన గేమింగ్ లుక్‌ని ఇస్తాయి. రెడ్ కలర్ కాంబినేషన్‌తో ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా చెవులలో చక్కగా ఇమిడిపోతాయి. ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా లేదా మ్యూజిక్ విన్నా చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్కువ బరువుతో ఉంటాయి.

35ms అల్ట్రా-లో లేటెన్సీ:

Advertisement

మొబైల్ గేమ్స్ ఆడియో సింక్ చాలా ముఖ్యం. BGMI లేదా Free Fire లాంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆడేటప్పుడు శత్రువుల అడుగుల చప్పుళ్లు సరిగ్గా విన పడటం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ హాప్అప్ Xo6 లో కేవలం 35ms అల్ట్రా-లో లేటెన్సీని అందించారు. దీని వల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియోలో ఎలాంటి ల్యాగ్ ఉండదు. మీరు గన్ ఫైర్ చేసిన వెంటనే సౌండ్ వినిపిస్తుంది. ఇది మీ గేమింగ్ ఫీల్ నెక్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

సౌండ్ క్వాలిటీ, 13mm డ్రైవర్లు:

కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా..మ్యూజిక్ లవర్స్‌ని కూడా ఈ ఇయర్‌ బడ్స్ నిరాశపరచవు. ఇందులో పవర్ ఫుల్ 13mm లార్జ్ డ్రైవర్లను వాడారు. దీని వల్ల పాటలు వినేటప్పుడు. బాస్ చాలా గట్టిగా, బీట్స్ స్పష్టంగా వినిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు.. కూడా డైలాగ్స్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. తక్కువ ధరలో.. ఇంత మంచి సౌండ్ అవుట్‌పుట్ రావడం నిజంగా విశేషం.

Advertisement

Also Read: రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

భారీ బ్యాటరీ బ్యాకప్:

బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో బ్యాటరీ లైఫ్.. తక్కువగా ఉంటుందనే అపోవు ఉంటుంది. కానీ.. హాప్అప్ Xo6 ఈ విషయంలో అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది మొత్తం 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడొచ్చు. తరచూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా ప్రయాణాల్లో కూడా దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.

రూ. 799 ధరలో 35ms లో-లేటెన్సీ,ఎల్ఈడీ లైట్లు, 13mm డ్రైవర్లు , 50H బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు అంటే ఇది నిజంగా ఒక గ్రేట్ డీల్ అనే చెప్పాలి. మీరు స్టైలిష్ గేమింగ్ లుక్‌తో పాటు మంచి ఫీచర్లు ఉన్న బడ్జెట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. హాప్అప్ Xo6 నిస్సందేహంగా ఒక ఎక్సలెంట్ ఛాయిస్ అవుతుంది.

Related News

మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా? ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్ మార్చారో లేదో ఒకసారి చూసుకోండి!

రూ.వెయ్యిలోపు బెస్ట్ హెడ్‌సెట్..బోట్ రాకర్జ్ 371 రివ్యూ ఇదిగో!

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

ఒకటి కొంటే ఇంకోటి ఉచితం.. రియల్‌మీ దీపావళి సేల్‌లో మతిపోయే ఆఫర్లు భయ్యా!

కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆధార్‌ అప్డేట్ నిమిషాల్లో!

ఈవినింగ్ స్నాక్స్ కోసం కరకరలాడే కుర్కురే పాస్తా..ఈజీ రెసిపీ ఇదే!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.15లకే అన్‌లిమిటెడ్ 5G డేటా!

Big Stories

Advertisement
×