E-Paper
Advertisement

గవర్నర్ కోటాలో ఎవరిని సెలెక్ట్ చేద్దాం.. లిస్ట్‌లో ఆ కీలక నేతల పేర్లు..?

గవర్నర్ కోటాలో ఎవరిని సెలెక్ట్ చేద్దాం.. లిస్ట్‌లో ఆ కీలక నేతల పేర్లు..?
Advertisement

Governor Quota: అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.ఈ నెలలోనే ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో, ఈ పదవుల కోసం గాంధీభవన్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే 50కి పైగా దరఖాస్తులు పీసీసీ ముందుకు రాగా, నవంబరు మొదటి వారంలోనే అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు జరుగుతోందని పార్టీ ముఖ్యులు తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయడంలో మంత్రుల నుంచి పీసీసీ చీఫ్​ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఈ ప్రాసెస్ లో జిల్లాల వారీగా మంత్రుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు మూడు ప్రధాన సమీకరణాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. క్యాస్ట్, పార్టీకి అందించిన సేవలు, ఫైనాన్సియల్ స్టేటస్ ఆధారంగా అభ్యర్ధులను సెలక్ట్ చేసే అవకాశం ఉన్నదని ఓ ముఖ్య నేత తెలిపారు. మరోవైపు జిల్లాల ఈక్వేషన్ లోనూ సెలక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటి వరకు ప్రభుత్వంలో నామినేటెడ్ రాని జిల్లాలను ఎంపిక చేసి పదవులు ఇవ్వాలని పార్టీ సీనియర్లు సీఎం, పీసీసీ చీఫ్​ లను కోరారు.

రెండు బీసీలకేనా..?

ప్రస్తుతం క్యాబినెట్ ,ప్రభుత్వ పదవుల్లో సరైన ప్రాతినిధ్యం దక్కని బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక గత పదేళ్ల ప్రతిపక్ష కాలంలో పార్టీ జెండా మోసి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. రీజనల్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా సెలక్షన్ ప్రాసెస్ జరగనున్నది. మరోవైపు తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, గవర్నర్ కోటాలోని 3 సీట్లలో కనీసం 2 సీట్లను బీసీలకే కేటాయించాలని పీసీసీ వర్గాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. పద్మశాలి సమాజానికి తగిన న్యాయం చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. దీంతో పాటు ముదిరాజ్ లకూ ఇవ్వాలని ఆయా సామాజిక వర్గానికి చెందిన నేతలు ట్రై చేస్తున్నారు. మరోవైపు దళిత వర్గాలకు న్యాయం చేయాలనే కోణంలో ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లు కూడా తీవ్ర పరిశీలనలో ఉన్నాయి.అంతేగాక ఉద్యమ కాలం నుంచి పార్టీ వెంట నిలిచిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక స్థానం ఇవ్వాలనే రిక్వెస్టులు కూడా పార్టీకి అందుతున్నాయి.

ఆశావహుల భారీ జాబితా .. సీఎం రేవంత్ మదిలో ఏముంది..?

Advertisement

గవర్నర్ కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ భారీగానే ఉన్నది. ప్రస్తుత విద్యాకమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్​, కాంగ్రెస్ సీనియర్ నేత దొమ్మాట సాంబయ్య, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్, పవన్ మల్లాది, కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతమ్, డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్తో పాటు మహిళా నేతలు ఇందిరాశోభన్, మహిళా కాంగ్రెస్ స్టేట్ మాజీ ప్రెసిడెంట్ సునీత ముదిరాజ్, డాక్టర్ లింగం యాదవ్ తదితరులు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పార్టీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గాంధీభవన్‌కు అందిన 50కి పైగాదరఖాస్తులను వడపోసిన తర్వాత టీపీసీసీ ,సీఎం రేవంత్ రెడ్డి లు తుది జాబితాను రూపొందించనున్నారు.ఆ తర్వాత హైకమాండ్ ఆమోదంతో పేర్లను అనౌన్స్ చేయనున్నారు.

Also Read: 75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

Tags

Related News

కేసీఆర్, కేటీఆర్‌లపై గులాబీ కేడర్ అలక.. యువనేతల్లో తీవ్ర అసంతృప్తి!

మోడీని డిఫెన్స్‌లో పడేసిన ‘ఫారెన్‌ లింక్‌’ అస్త్రం! ధీటుగా సవాల్‌ విసిరి దేశ వ్యాప్త చర్చకు తెరలేపిన రాహుల్‌! మోడీ ఒకటి తలిస్తే..!

అమరవీరుల కాలనీ ఫామ్‌హౌజ్‌ దగ్గర ఎందుకు? ఉద్యమకారులకు కూడా మియాపూర్‌లో జాగాలివ్వండి! కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ బూమరాంగ్‌!

ఏడాది తరువాత కోదండరామ్‌కు టైం ఇచ్చిన సీఎం! కలిసిన టీజేఎస్ ప్రతినిధులు! కరువు నేపథ్యంపై ప్రొఫెసర్‌ కీలక చర్చలు!

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ…! ఈ రాష్ట్రాల్లో జనాలకు సీఎంలు భయపడాల్సిందే.. జవాబుదారీ పాలన అందివ్వాల్సిందే!

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌రావుకు ‘ఫ్రీ హ్యాండ్.. ఎందుకో తెలుసా..?

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

Big Stories

Advertisement
×