BigTV English

OTT Movie : భూమిపై 98 శాతం పిల్లలు మాయం… అంతుచిక్కని వ్యాధి వల్ల సూపర్ పవర్స్… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : భూమిపై 98 శాతం పిల్లలు మాయం… అంతుచిక్కని వ్యాధి వల్ల సూపర్ పవర్స్… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : యాక్షన్, ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఒక సూపర్ హీరోస్ మూవీ యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో భూమి మీద ఒక ఘోర విపత్తు వల్ల చిన్న పిల్లలు అంతరించిపోతారు. 2% మాత్రమే మిగులుతారు. వీళ్లకు మాత్రమే సూపర్ పవర్స్ ఉంటాయి. ఇక వీళ్ళు చేసే విన్యాసాలతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

అమెరికాలో ఒక విచిత్రమైన వ్యాధి కారణంగా 98% మంది పిల్లలు మరణిస్తారు. బతికి ఉన్న 2% మంది పిల్లలు అసాధారణ శక్తులను పొందుతారు. రంగులను బట్టి, ఈ శక్తుల ప్రమాదకర స్థాయిని తెలుసుకోవచ్చు. బ్లూ: టెలికినిసిస్ (వస్తువులను మనసుతో కదిలించే శక్తి), యెల్లో: విద్యుత్ శక్తిని నియంత్రించే సామర్థ్యం,రెడ్: అగ్నిని నియంత్రించే శక్తి, ఆరెంజ్: ఇతరుల మనస్సులను నియంత్రించే సామర్థ్యం (ఇది అత్యంత ప్రమాదకరమైనది). ప్రభుత్వం ఈ శక్తులను పొందిన పిల్లలను చూసి భయపడి, వారిని ప్రమాదకరమైనవారుగా భావించి శిబిరాల్లో బంధిస్తుంది. ఈ శిబిరాలకు సెక్యూరిటీ సిస్టం కూడా గట్టిగానే ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్, రెడ్ శక్తులు కలిగిన పిల్లలను తరచూ చంపేస్తుంటారు.

ఈ కథలో రూబీ అనే 16 ఏళ్ల అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక ఆరెంజ్, అంటే ఆమె ఇతరుల మనస్సులను చదవగలదు, నియంత్రించగలదు. ఆమె తన శక్తులను దాచడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక సంఘటనలో ఆమె సామర్థ్యం బయటపడుతుంది. ఆమెను థర్మండ్ అనే కఠినమైన శిబిరంలో బంధిస్తారు. ఇక్కడ ఆమె ఆరు సంవత్సరాలు గడుపుతుంది. రూబీ తన ఆరెంజ్ శక్తులను దాచి, తనను తాను గ్రీన్‌గా చూపించుకోవడంతో బతికి ఉంటుంది.


ఒక రోజు రూబీ డాక్టర్ కేట్ సహాయంతో శిబిరం నుండి తప్పించుకుంటుంది. ఆమె పారిపోయిన తర్వాత లియామ్, చబ్స్, జూ అనే మరో ముగ్గురు యువకులను కలుస్తుంది. వీరంతా కలిసి ఈస్ట్ రివర్ అనే ఒక సురక్షిత స్థలాన్ని వెతుక్కుంటూ ప్రయాణిస్తారు. ఇది శక్తులు కలిగిన పిల్లలకు స్వేచ్ఛగా జీవించే ప్రదేశంగా పుకారు ఉంది. ఈ ప్రయాణంలో రూబీ, లియామ్ మధ్య ఒక శృం*గార బంధం ఏర్పడుతుంది. కానీ రూబీ తన ఆరెంజ్ శక్తుల గురించి రహస్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఆమె శక్తులు ఇతరులను నియంత్రించగలవు, కాబట్టి ఆమెను చూసి భయపడతారని ఆమె అనుకుంటుంది.

వీళ్ళంతా చివరకు ఈస్ట్ రివర్‌ను చేరుకుంటారు. అక్కడ క్లాన్సీ గ్రే అనే ఆరెంజ్ శక్తులు కలిగిన యువకుడు నాయకత్వం వహిస్తుంటాడు. మొదట్లో ఈస్ట్ రివర్ స్వేచ్ఛా స్థలంలా కనిపిస్తుంది. కానీ క్లాన్సీ తన ఆరెంజ్ శక్తులను ఉపయోగించి ఇతర పిల్లలను నియంత్రిస్తున్నాడని రూబీకి తెలుస్తుంది. అతను రూబీని కూడా నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రూబీ తన శక్తులను ఉపయోగించి అతనితో పోరాడుతుంది. ఇక క్లైమాక్స్ లో రూబీ, లియామ్, చబ్స్, జూ కలిసి క్లాన్సీ చెడు ఆలోచనలను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియలో రూబీ తన ఆరెంజ్ శక్తులను బయటికి తెస్తుంది. రూబీ తన శక్తులతో క్లాన్సీ ని నియంత్రిస్తుందా ? అతని చేతిలో ఓడిపోతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

“ది డార్కెస్ట్ మైండ్స్” (The Darkest Minds) 2018లో విడుదలైన అమెరికన్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం. జెన్నిఫర్ యూహ్ నెల్సన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం అలెక్సాంద్రా బ్రాకెన్ 2012 నవల “ది డార్కెస్ట్ మైండ్స్” ఆధారంగా తీయబడింది. ఇందులో అమండ్లా స్టెంబర్గ్ (రూబీ డాలీ), హ్యారిస్ డికిన్సన్ (లియం స్టువర్ట్), మాండీ మూర్ (కేట్), గ్వెండోలిన్ క్రిస్టీ (లేడీ లియా), ప్యాట్రిక్ గిబ్సన్ (క్లాన్సీ గ్రే)ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : బాబోయ్ అన్నీ అవే సీన్లు… కట్టుకున్న వాడు ఉండగానే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : మరో అమ్మాయితో భర్త ప్రైవేట్ వీడియో లీక్… డర్టీ పొలిటికల్ గేమ్ లో ఫ్యామిలీ బలి… ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస హత్యలు… పోలీస్ భార్యను కూడా వదలకుండా… కళ్ళు లేని ఖాకీ రఫ్ఫా రఫ్ఫా

OTT Movie : పోయినోళ్ళను తిరిగిచ్చే యాప్… భర్తను బలిచ్చి ముసలాడితో సెటిలయ్యే అమ్మాయి… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : తెగిపడే బొమ్మల తలలు… మనుషులు కన్పిస్తే ముక్కలు ముక్కలుగా నరికి… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ మావా

OTT Movie : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

Big Stories

×