Weather News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు ఎండ, మరో వైపు వానలు కురుస్తున్నాయి. అయితే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈస్ట్ మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వివరించారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అన్నారు.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
రాబోయే గంట నుంచి రెండు గంటల్లో షేక్ పేట, మాదాపూర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, రాయదుర్గ్, గచ్చి బౌలి, కొండాపూర్, మియాపూర్, ఆర్సీ పురం, శేరి లింగంపల్లి, పటాన్ చెరు, కుత్బుల్లా పూర్, గాజుల రామారం, బాలానగర్, సుచిత్ర, జీడిమెట్ల, చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మణికొండ, ఖాజాగూడ, షేక్ పేట, టోలీచౌకి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ: Bathukamma Festival: మన హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిఎత్తైన బతుకమ్మ.. రెండు కళ్లు సరిపోవు..
ఈ జిల్లాల్లో కుండపోత వాన..
మరి కాసేపట్లో పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నల్గొండ, కరీంనగర్, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు్న్నారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడే ఛాన్స్ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కొంద నిలబడొద్దని చెబుతున్నారు.