నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు షాకింగ్ గా ఉంటాయి. తాజాగా అలాంటి మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ దేశంలో పలు విదేశీ పదాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఐస్ క్రీం’, ‘హాంబర్గర్’, ‘కరోకే’ సహా పలు ఇంగ్లీష్ పదాలను బ్యాన్ చేశారు. దేశంలో కొత్తగా ప్రారంభించబడిన వోన్సాన్ బీచ్ సైడ్ రిసార్ట్ లో పనిచేసే టూర్ గైడ్‌లు పర్యాటకులతో మాట్లాడేటప్పుడు విదేశీ పదాలతో పాటు దక్షిణ కొరియన్ పదాలను ఉపయోగించకూడదని ఆదేశించారు. గైడ్‌లు ప్రభుత్వం నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొని, నార్త్ కొరియా ప్రజలు అధికారికంగా ఆమోదించబడిన స్లోగన్స్, పదాలను మాత్రమే ఉపయోగించాలన్నారు.
ఇకపై నార్త్ కొరియాలో ‘హాంబర్గర్’ అనే పదాన్ని ఉపయోగించకుండా, డాజిన్ గోగి గ్యోప్పాంగ్ (డబుల్ బ్రెడ్ విత్ గ్రౌండ్ బీఫ్) అని చెప్పాలని సూచించారు. ఐస్ క్రీంను ఎసుకిమో (ఎస్కిమో) అని పిలవాలన్నారు. కరోకే మినషన్లను ‘On Screen Accompaniment Machines’ అనాలన్నారు. పర్యాటకుల దగ్గర ఉత్తర కొరియా పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు వారు కూడా మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. భాష ద్వారా సాంస్కృతిక ముప్పును నివారించాలని అధికారులకు కిమ్ సూచించారు.
ఉత్తర కొరియాలో కఠినమైన, అసాధారణమైన నియమాలు అమలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి నిర్ణయాలు కిమ్ చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో సాధారణమైనవిగా పరిగణించబడే ప్రవర్తనకు అక్కడ తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. విదేశీ సినిమాలు, టీవీ షోలో చూసినా, ఇతరులతో పంచుకున్న వారికి మరణశిక్ష విధించిన సందర్భాలున్నాయి. 2023లో దేశం నుంచి పారిపోయిన ఒక మహిళ తన ముగ్గురు స్నేహితులను సౌత్ కొరియా టీవీ షోలు ఉన్నాయనే కారణంతో ఉరితీశారని వెల్లడించింది.
ఉత్తర కొరియాలో పెరుగుతున్న అణచివేత వాతావరణం నేపథ్యంలోనే భాషపై ఆంక్షలు వచ్చాయి. 2014 నుంచి జరిగిన పరిణామాలను సమీక్షిస్తూ తాజాగా ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను వెల్లడించింది. గత దశాబ్దంలో అణచివేత మరింత పెరిగినట్లు వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ మీడియాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే పౌరులను లక్ష్యంగా చేసుకుని కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా షోలు చూస్తున్న, విదేశీ సంగీతాన్ని వింటున్న, నిషేధిత చిత్రాలను చూస్తున్న వ్యక్తులకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు తెలిపింది. “2015 నుంచి నార్త్ కొరియా శత్రు దేశాలుగా పిలవబడే వాటి నుంచి సమాచారాన్ని వినియోగించడాన్ని నేరంగా పరిగణించే కఠినమైన చట్టాలను ఆమోదించింది. 2018 నుంచి కఠిన చర్యలు మరింత తీవ్రమయ్యాయి, 2020 తర్వాత శిక్షలు కఠినంగా మారాయి. అంతేకాదు, చట్టాలకు లోబడిని వారికి బహిరంగ విచారణలు జరిపి ఉరిశిక్షలను అమలు చేయడం ద్వారా అక్కడి ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నం చేస్తోంది” అని యుఎన్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం నుంచి తీవ్ర ఆంక్షలు ఉన్నప్పటికీ, చాలా మంది ఉత్తర కొరియన్లు అక్రమంగా రవాణా చేయబడిన USB స్టిక్‌లు, అక్రమ రేడియో ప్రసారాలను ఉపయోగించి నిషేధిత మీడియాను యాక్సెస్ చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
Read Also: ఒకే వ్యక్తితో తల్లి, కూతురు సంబంధం.. ఒకేసారి గర్భం కూడా, ఛీ పాడు!