E-Paper
Advertisement

స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్.. వీడియోలు విడుదల!

స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్.. వీడియోలు విడుదల!
Advertisement

AP Elections: ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే.. Free and Fair Electionsకు పాడె కట్టిన ప్రజాస్వామ్యం అనే విధంగా ఉందని వైఏస్ జగన్ తనఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసి ప్రజాస్వామ్యం, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన ప్రజాస్వామ్యం, గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన ప్రజాస్వామ్యం, ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే ప్రజాస్వామ్యం, నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే ప్రజాస్వామ్యం అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన ప్రజాస్వామ్యం అంటూ జగన్ సంచలన పోస్ట్ చేశారు.

మా పాలనలో..

గత ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన ప్రజాస్వామ్యంలా మారిందని అన్నారు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడికే సాద్యం అని జగన్ విమర్షించారు.

చంద్రబాబు మాఫియా..

Advertisement

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అని, ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన ప్రజాస్వామ్యం ఇదిఅంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే అని అన్నారు.

వీడియోలు విడుదల..

పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌ చేస్తున్నాను. మీరే చూడండి అంటూ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisement

Also Read: సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!

Tags

Related News

యలహంక ప్యాలెస్‌లోకి షర్మిలను రానివ్వొద్దంటూ.. కోర్టులో జగన్ పిటిషన్!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఓ భక్తుడి అపూర్వ కానుక!

ఉత్తరాంధ్ర లోకల్ ఫైట్.. బరిలో హై-ప్రొఫైల్ సతీమణులు!

కమలం, గ్లాస్, సైకిల్ గుర్తులు వేరే.. మా లక్ష్యం ఒక్కటే: ఎంపీ పురందేశ్వరి

చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!

వైసీపీది అంతా రివర్స్ వ్యవహారం.. పట్టణాలే కాదు-పల్లెల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×