OTT Movie : దేవుడి గురించి ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. అయితే ఈ సినిమా దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం మీద నడుస్తుంది. పాజిటివ్ థింకింగ్ కి ఈ మూవీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి దేవుణ్ణి ఎంతలా నమ్ముతుందో, దాని వల్ల జరిగే అద్భుతాలు ఏమిటో ఈ మూవీ లో చూడచ్చు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ క్రైస్తవ డ్రామా మూవీ పేరు ‘ది గర్ల్ హూ బిలీవ్స్ ఇన్ మిరాకిల్స్’ (The Girl Who Believes in Miracles). 2021 లో విడుదలైన ఈ మూవీకి రిచర్డ్ కొర్రెల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీరా సోర్వినో, పీటర్ కొయోట్, ఆస్టిన్ జాన్సన్, కెవిన్ సోర్బో నటించారు. ఈ సినిమా విశ్వాసం, ప్రార్థన, అద్భుతాల శక్తి గురించి ఒక భావోద్వేగ కథనంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సారా హాప్కిన్స్ అనే ఒక చిన్న అమ్మాయికి దేవుడిపై గట్టి విశ్వాసం కలిగి ఉంటుంది. ఒక రోజు ఆమె తన సోదరుడు డానీ, అతని స్నేహితురాలు సిండీతో సరస్సు వద్దకి వెళ్తుంది. అక్కడ ఒక చనిపోయిన పక్షిని చూస్తుంది. ఆమె దేవుడికి ప్రార్థన చేస్తే అది తిరిగి బతుకుతుందని నమ్ముతుంది. అలాగే ప్రార్థించడంతో, ఆ పక్షి నిజంగానే బ్రతుకుటుంది. తర్వాత, డానీ కారు డ్రైవింగ్ చేస్తుండగా, ఎదురుగా వస్తున్న కారుని ప్రమాదం జరగకుండా తప్పిస్తాడు. కానీ ఎదురుగా వస్తున్న కారు కుక్కను గుద్దుకుంటుంది. ఆ ప్రమాదంలో కుక్క కూడా చనిపోతుంది. సారా ఆ కుక్కను కూడా ప్రార్థన చేసి బతికించి, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సారా బెస్ట్ ఫ్రెండ్ మార్క్ కు కాళ్లు పనిచేయకుండా ఉంటాయి. ఇది చూసి, ఆమెతో అతడు ప్రార్థన చేయమని కోరుతాడు. ఆ తరువాత అతను కూడా నడవగలుగుతాడు.
సారా ప్రార్థనల వల్ల ఊరిలోని ప్రజలు అనేక అద్భుతాలను చూస్తారు. గుడ్డివారు చూడగలుగుతారు, కుంటివారు నడవగలుగుతారు, తీవ్రమైన అనారోగ్యాలు తగ్గుతాయి. సారా కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోతుంది. కానీ ఈ గుర్తింపు ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చివరికి, సారాకు ఒక చికిత్స చేయలేని జబ్బు వస్తుంది. ఆమెకు మెదడులో కణితి ఉన్నట్లు తెలుస్తుంది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆమె తాత, సారా చివరి కోరికను నెరవేర్చడానికి ఆసుపత్రి నుండి ఆమెను ఒక సరస్సు వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ ఆమె దేవుడిని చూసిందని తాతకు చెప్తుంది. చివరికి అందరికీ ప్రాణం పోసిన ఈ అమ్మాయికి, దేవుడు ప్రాణం పోస్తాడా ? తీస్తాడా ? అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Also Read : అమ్మాయిలే లేని ఊరు.. ఐదుగురు భర్తలకు ఒకే భార్యనా? ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా సామీ