OTT Movie : ఓటీటీలో ఎటువంటి సినిమాలు కావాలన్నా అందుబాటులో ఉన్నాయి. కొన్ని స్టోరీలో ఆలోచనలో పడేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ లో ఒక అమ్మాయిని ఐదు మంది అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు. ఈ స్టోరీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘మాతృభూమి: ఎ నేషన్ వితౌట్ విమెన్’ (Matrubhoomi: A Nation Without Women). 2003 లో విడుదలైన ఈ సినిమాకు మనీష్ ఝా దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్త్రీ శిశు హత్య, స్త్రీల సంఖ్య తగ్గిపోవడం వల్ల సమాజంలో లింగ సమతుల్యత ఏర్పడే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ స్టోరీ భవిష్యత్తులో భారతదేశంలోని ఒక గ్రామంలో జరుగుతుంది. అక్కడ స్త్రీ శిశు హత్యల వల్ల స్త్రీలు పూర్తిగా అంతరించిపోయి, కేవలం పురుషులు మాత్రమే మిగులుతారు. అక్కడినుంచి అసలు స్టోరీ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
బిహార్‌లోని ఒక గ్రామంలో ఒక దంపతులకు ఆడపిల్ల పుడుతుంది. కొడుకు కోసం ఆశపడిన ఆ తండ్రి నిరాశతో ఆ శిశువును పాలతొట్టిలో ముంచి చంపేస్తాడు. అది కూడా బహిరంగంగా జరిగే ఒక వేడుకలో ఈ ఆచారం కొనసాగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో స్త్రీలు లేకుండా పోతారు. కేవలం పురుషులు, కొద్దిమంది వృద్ధ మహిళలు మాత్రమే మిగులుతారు. ఈ పరిస్థితి వల్ల గ్రామంలోని యువకులు భార్యల కోసం తీవ్రంగా ఆరాటపడతారు. వారు తమ నిరాశను పోర్నోగ్రాఫిక్ సినిమాలు చూడటం, ఆడవేషాలతో నృత్య ప్రదర్శనలు, జంతువులతో సంబంధాలు వంటి వికృత చర్యల ద్వారా తీర్చుకుంటారు. భార్యలను సంపాదించడానికి చాలా అడ్డదారులు తొక్కుతుంటారు. ఆ గ్రామంలో ధనవంతుడైన రామ్‌చరణ్ అనే వ్యక్తికి ఐదుగురు కొడుకులుగా ఉంటారు. అతను గ్రామానికి దూరంగా ఉన్న ఒక యువతి, కల్కి, గురించి తెలుసుకుంటాడు. కల్కి తండ్రి ఆమెను డబ్బు కోసం రామ్‌చరణ్‌కు అమ్మేస్తాడు.
రామ్‌చరణ్ ఆమెను తన ఐదుగురు కొడుకులకు భార్యగా పెళ్లి చేస్తాడు. అయితే, కల్కి జీవితం దుర్భరంగా మారుతుంది. ఆమెను ఐదుగురు సోదరులతో పాటు రామ్‌చరణ్ కూడా లైంగికంగా వేధిస్తారు. ఆమె ఒక బానిసలా గొలుసులతో బంధించబడి, గృహ హింసకు గురవుతుంది. కల్కి మాత్రం వాళ్ళల్లో, ఒక సోదరుడితో ప్రేమలో పడుతుంది. కానీ ఈ సంబంధం ఇతర సోదరులలో ఈర్ష్యను పెంచుతుంది. ఇంతలో ఆమె గర్భవతి కూడా అవుతుంది. కానీ బిడ్డ తండ్రి ఎవరో తెలీకపోవడంతో, సోదరుల మధ్య ఘర్షణలు మొదలవుతాయి. ఈ గొడవలు గ్రామంలో హింసాత్మక అల్లర్లకు దారితీస్తాయి, దీనిలో చాలామంది పురుషులు చనిపోతారు. చివరికి, కల్కి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ‘మాతృభూమి’ తీవ్రమైన విమర్శలు అందుకుని, 2003 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది, అక్కడ ఇది FIPRESCI అవార్డును గెలుచుకుంది.
Also Read : అమ్మాయిలే లేని ఊరు… ఐదుగురు భర్తలకు ఒకే భార్యనా? ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా సామీ