Kissik Talks: బిగ్ టీవీలో ప్రారంభమయిన కిస్సిక్ టాక్స్ అనే పోడ్కాస్ట్‌కు సీనియర్ నటీనటులు గెస్టులుగా వస్తూ వారి పర్సనల్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. అలా కిస్సిక్ టాక్స్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ షోకు గెస్ట్‌గా సీనియర్ నటి వై విజయ (Y Vijaya) వచ్చారు. వై విజయ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా.. అందులో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అందరినీ నవ్వించారు. యాంకర్ అయిన వర్షపైనే సెటైర్లు వేశారు. అంతే కాకుండా తనకు ఇండస్ట్రీలో ఎవరు క్లోజ్ అనే విషయాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శనివారం రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.
సేవింగ్స్ ముఖ్యం
‘‘మాది కడప. మా ఇంట్లో అటక మీద కడప బాంబులు ఉంటాయి’’ అంటూ వై విజయ చేసే కామెడీతో కిస్సిక్ టాక్స్ ప్రోమో మొదలవుతుంది. వెంకటేశ్ ఎప్పుడూ కామెడీగా ఉంటారని చెప్తూ ‘ఎఫ్ 2’ నుండి వెంకీ ఆసన్ కూడా వేసి చూపించారు విజయ. ఆ తర్వాత అదే సినిమా నుండి డైలాగులు చెప్పి ఎంటర్‌టైన్ చేశారు. డబ్బులు సేవ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆలోచన లేకుండా ఖర్చు పెట్టడం చాలా తప్పు. సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. ఇలా ఆలోచించడానికి విజయశాంతి కూడా ఒక కారణం. మనం ఎన్ని సంవత్సరాలు ఇలా సినిమాలు చేస్తాం, మనకంటూ ఏదైనా ఆదాయం ఉండాలి కదా, నాకు రూ.50 వేలు వస్తే చాలు అనేది’’ అంటూ విజయశాంతి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు వై విజయ.
అలా చేసి పాడైపోయారు
‘‘పాత ఆర్టిస్టుల కోసం కొంతమంది కొత్త ఆర్టిస్టులు దాన, ధర్మాలు చేసి పాడైపోయారు. వాళ్ల దగ్గర నుండే నేను చాలా నేర్చుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు వై విజయ. ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే కష్టం, టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని అన్నారు. ఇండస్ట్రీలో తన ఫ్రెండ్ ఎవరు అని అడగగా.. జయమాలిని, నలిని, సత్యప్రియ పేర్లు చెప్పారు. వారంతా కలిసి పార్టీలు కూడా చేసుకుంటారని బయటపెట్టారు. తనకు వైన్ తాగే అలవాటు ఉందని రివీల్ చేశారు. కానీ తగిన ప్రతీసారి తలనొప్పి వస్తుందని అన్నారు. రమ్యకృష్ణ నవ్వును, అన్నపూర్ణమ్మ ప్రవర్తనను ఇమిటేట్ చేసి చూపించారు వై విజయ.
Also Read: దీపికా పదుకొనెకు ఇష్టమైన ప్రాంతం ఏంటో తెలుసా.?
అలాంటి పాత్రలు చేయొద్దు
‘‘తెల్లవారుజామున మెలకువ వస్తే శత్రువులే జ్ఞాపకం వస్తారు. డబ్బులు ఇవ్వాల్సినవాడు ఇవ్వలేదు. మ్యానేజర్‌కు ఫోన్ చేయాలి.. ఇలా అన్నీ గుర్తొస్తాయి’’ అని చెప్పి నవ్వించారు వై విజయ. వర్ష బట్టలపై కామెంట్ కూడా చేశారు. ఇప్పటి సినిమాల్లో అసలు ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం లేదని, అలాంటివి చేయకపోవడమే బెటర్ అన్నారు. డబ్బు కోసమైతే ఓకే, ఇమేజ్‌ది ఏముందిలే అనుకుంటేనే అలాంటి పాత్రలు చేయొచ్చు అన్నారు. ‘‘హీరోయిన్ గిరిజ తన సొంత ఖర్చుతో ఫ్రెండ్స్‌ను కోలకత్తాలోని దుర్గా పూజకు తీసుకెళ్లి తీసుకొచ్చేవారట. అంత మంచి నటి రూ.100 కోసం కష్టపడేవారు. రూ.100 లేకపోతే రూ.50. చీరలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని వాళ్ల అమ్మ వచ్చి అడిగేవారు. దాన, ధర్మాలు చేసిన ఎంతోమంది ఆర్టిస్టులు ఏమీ లేకుండానే చనిపోయారు’’ అంటూ ఇండస్ట్రీలోని పరిస్థితులను బయటపెట్టారు వై విజయ.