OTT Movie : యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో హాలీవుడ్ ఒక అడుగు ముందే ఉంటుంది. వీళ్ళు తీసే యాక్షన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కింది. ఇందులో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తండ్రీ కూతుర్ల మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఇందులో అబ్బురపరిచే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పేరు ‘టాంబ్ రైడర్’ (Tomb Raider). 2018 లో వచ్చిన ఈ మూవీకి రోర్ ఉథాగ్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ లారా క్రాఫ్ట్ అనే పాత్ర చుట్టూ తిరిగే ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా. ఈ సినిమా 2013 లో విడుదలైన వీడియో గేమ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో అలీసియా వికాండర్ లారా క్రాఫ్ట్ పాత్రలో నటించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
లారా క్రాఫ్ట్ ఒక ధైర్యవంతమైన యువతి. ఆమె తండ్రి లార్డ్ రిచర్డ్ క్రాఫ్ట్ ఒక ప్రముఖ ఆర్కియాలజిస్ట్. అతను ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌లోని ఒక ద్వీపంలో అదృశ్యమవుతాడు. లారా తన తండ్రి చనిపోయాడని నమ్మడానికి ఇష్టపడదు. అతని వారసత్వాన్ని స్వీకరించడానికి కూడా అంగీకరించదు. లండన్‌లో బైక్ కొరియర్‌గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతుంది. ఒక రోజు, ఆమె తండ్రి నుండి ఒక రహస్య సందేశం వస్తుంది. అతను హిమికో అనే పురాతన జపనీస్ రాణి గురించి పరిశోధన చేస్తున్నట్లు, ఆమె సమాధి యమతాయ్ అనే ద్వీపంలో ఉందని తెలుస్తుంది. హిమికో గురించి అనేక కథలు ఉన్నాయి. ఆమె సమాధిని తెరిస్తే ప్రపంచానికి ప్రమాదం వస్తుందని రిచర్డ్ హెచ్చరిస్తాడు. అతను ఆ పరిశోధనను నాశనం చేయమని లారాకు సమాచారం పంపుతాడు. కానీ లారా ఆ సమాధి గురించి లెక్కచేయకుండా, తన తండ్రిని కనిపెట్టేందుకు యమతాయ్ ద్వీపానికి ప్రయాణం చేస్తుంది.
లారా హాంగ్ కాంగ్‌కు వెళ్లి, అక్కడ లూ రెన్ అనే ఓడ కెప్టెన్‌ను కలుస్తుంది. లూ రెన్ తండ్రి కూడా రిచర్డ్‌తో పాటు అదృశ్యమయ్యాడు. వారు కలిసి ‘డెవిల్స్ సీ’ లోని యమతాయ్ ద్వీపానికి బయలుదేరతారు. అయితే, ఒక భయంకరమైన తుఫానులో వారి ఓడ మునిగిపోతుంది.లారా ఒడ్డుకు చేరుతుంది కానీ ఒక దుండగుడు ఆమెను కొట్టడంతో స్పృహ తప్పిపోతుంది. లారా మేల్కొన్నప్పుడు మథియాస్ వోగెల్ అనే వ్యక్తి ఆమెను బంధిస్తాడు. అతను హిమికో శక్తిని ఆయుధంగా మార్చాలనే లక్ష్యంతో ఆమె సమాధిని వెతుకుతుంటాడు. అక్కడ లారా, లూ రెన్ సహాయంతో తప్పించుకుంటుంది. చివరికి లారా తన తండ్రిని కనిపెడుతుందా ? హిమికో సమాధి వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ?అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : సూపర్ నేచురల్ పవర్స్ ఉండే పిల్ల… ఆమె టార్చర్ కంటే నరకమే బెటర్