OTT Movies : ఓటీటీలోకి ఈ మధ్య ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. హారర్, సస్పెన్స్ సినిమాలకు జనాలు మొగ్గు చూపిస్తున్నారు.. గత ఏడాది నుంచి ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. రెండు రోజులకే భారీగా వ్యూస్ ను అందుకుంటుంది. భయంకరమైన హారసన్నివేశాలతో వెన్నులో వణుకు పట్టించే ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
హారర్ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. ఈమధ్య ఓటీటీ సంస్థలు ఎక్కువగా పాత సినిమాలను అందుబాటులో కి తీసుకొని వస్తున్నారు.. తాజాగా ఓ హారర్ మూవీ ఓటీటీలో స్విమ్మింగ్ కి వచ్చేసింది.. ఆ మూవీ పేరు ‘గ్రాఫ్టెడ్’.. గతేడాది సెప్టెంబర్ 12న రిలీజైంది. ఈ న్యూజిలాండ్ ఇంగ్లిష్ మూవీకి శాషా రెయిన్‍బో దర్శకత్వం వహించారు. జెయేనా సన్, జెస్ హాంగ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ సినిమాలో అత్యంత క్రూరమైన హారర్ సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. మొన్నటి వరకు రెంటు చెల్లించి ఈ సినిమాని చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ నిన్నటి నుంచి సాధారణ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.. ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారంతా ఇప్పుడు గ్రాఫ్టెడ్ చిత్రాన్ని చూడొచ్చు.
Also Read :బుల్లితెరపై యాంకర్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలా? బయటపడుతున్న నిజాలు..
స్టోరీ విషయానికొస్తే..
ఇది భయంకరమైన హారర్ మూవీ.. హారర్ చిత్రాలంటే దెయ్యాలు, పిశాచాలతో ఉంటాయి. బాడీ హారర్ జానర్ కాస్త డిఫరెంట్. మనిషే రూపాలు మారుస్తూ భయపెట్టేలా సాగేదే ఈ జానర్. గ్రాఫ్టెడ్ మూవీ బాడీ హారర్‌గా రూపొందింది. ఈ మూవీలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. అత్యంత భయంకరమైన సీన్లు ఇందులో ఉన్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటరిగా చూస్తే ఫ్యాంట్ తడిసిపోతుంది.. కళ్ల ముందే దెయ్యాలు ఉన్నట్లు అనిపిస్తుందని ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. అమ్మాయి, అతడి తండ్రికి ముఖం, మెడపై పుట్టుకతోనే కొన్ని మచ్చలు ఉంటాయి. దీంతో వీ బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో పరిశోధన చేసి ఓ సీరమ్ కనిపెట్టిన కొన్ని రోజులకు వీ తండ్రి చనిపోతాడు. తన తండ్రి కనిపెట్టిన పరిశోధనని ఆమె కొనసాగిస్తుంది. తన ముఖాన్ని ఎవరిలాగైనా మార్చేసుకుంటుంది వీ. పాపులారిటీ కోసం ఆమె భయానక పనులు చేస్తుంటుంది. తనకు ప్రమాదం అనుకున్న వారిని మట్టుబెట్టేస్తుంది. వీ ఏమేం చేస్తుంది? పరిస్థితులు ఎలా మారాయి? అన్నది స్టోరీ.. ఈ సినిమాను చెప్పడం కంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి..