Tv Channels : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. సినిమాల్లో లేదా ఏదైనా స్క్రీన్ మీద కనిపించాలంటే కచ్చితంగా అవతల వాళ్ళు అడిగినట్లు బెడ్ ని షేర్ చేసుకోవడం అనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈనెలలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల ఒక్కొక్కరు తమకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి పలు ఇంటర్వ్యూల ద్వారా బయటపెడుతున్నారు. హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఇలాంటి బాధలను అనుభవించినట్లు వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు వెండితెరపై అవకాశాల కోసమే ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు చాలా మంది చెప్పారు. కానీ బుల్లితెరపై యాంకర్ గా అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా సమర్పించుకోవాలని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అసలు మ్యాటర్ ఏంటో వివరంగా తెలుసుకుందాం..
క్యాస్టింగ్ కౌచ్ పై పెరుగుతున్న ఫిర్యాదులు..
ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అయితే తెలుగులో కన్నా ఇతర ఇండస్ట్రీలలోని యాక్టర్స్ లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ పలు మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటుగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాల గురించి బయటకు వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ఆరోపణలు కొత్తకాదు. ఎంతోకాలంగా దీనిపై చర్చ జరుగుతున్నా.. బయట పెట్టేందుకు చాలామందికి దైర్యం సరిపోదు. అయితే ఆరేళ్ల కిందట శ్రీరెడ్డి ఈ సాహసం చేసింది. అప్పట్లో ఇది సంచలనం కలిగించింది. 2018 నటి శ్రీరెడ్డి టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనానికి దారి తీసింది. శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాలని మహిళా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు డిమాండ్ చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సమాచార ప్రసార శాఖకు నోటీసులు ఇచ్చింది.. ఆ తర్వాత ధైర్యం చేసి ఒక్కొక్కగా బయటకొస్తూ తమకు ఎదురైనా అనుభవాలనే పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు వెండి ధరపై మాత్రమే కాదు బుల్లితెరపై అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద చర్చ నడుస్తుంది.
Also Read :నేల మీద పడుకొనేవాడిని.. ఆకలితో పడుకున్న.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…
బుల్లితెర యాంకర్ అవ్వాలంటే కమిట్ అవ్వాలా..?
నిన్నటి వరకు కేవలం వెండి తెరపై నటించే అమ్మాయిలకు మాత్రమే ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అందరూ అనుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఇలాంటివే జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ద్రావణంలా వ్యాపించి వైరల్ గా మారింది.. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ అవ్వాలంటే షో డైరెక్టర్లతోనూ, కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అని వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. ఇటీవల యాంకర్ రీతు చౌదరి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను బట్టి కచ్చితంగా బుల్లితెరపై కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని నిజాలు బయటపడ్డాయి. ఎక్కడికెళ్లినా కూడా అమ్మాయిలకు ఇలాంటి బాధలు తప్పట్లేదు. ఇలాంటి వారి వల్లే కొందరు తమ టాలెంట్ ని తమలోని దాచుకొని ఇంటికి పరిమితమయ్యారని సమాజంలోని కొందరు మహిళలు సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వార్తలపై ఇండస్ట్రీలు ఎలా స్పందిస్తాయో చూడాలి..