The Kerala story 2: సాధారణంగా కొన్ని చిత్రాలు విడుదలకు ముందే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వివాదాల్లో చిక్కుకుంటాయి. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ‘ది కేరళ స్టోరీ’ మూవీ కూడా ఒకటి. 2023లో ఆదా శర్మ లీడ్ రోల్ లో వచ్చిన ది కేరళ స్టోరీ సినిమా ఏ రేంజ్ లో విమర్శలు , వివాదాలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ది కేరళ స్టోరీ 2 ఫిబ్రవరి 27న ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ మాత్రం ఫర్వాలేదు అనిపించుకుంది.
కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సుమిత్ గహ్లావత్, ఉల్కా గుప్తా , అదితి భాటియా, ఐశ్వర్య ఓజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్ లాల్ షా నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సుమారుగా రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 8వ తేదీ నుంచి ఈ సినిమాను డిజిటల్ గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ జీ5 అధికారికంగా పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్ని కూడా పంచుకుంటూ..” ప్రతి పరిపూర్ణమైన ప్రేమ కథ వెనుక ఒక పథకం ప్రకారం పన్నిన ఉచ్చు దాగి ఉంటుంది. దివ్య, నేహా , సురేఖల కలలు పీడకలగా మారిన ఆ క్షణాన్ని మీరు కూడా చూడండి” అంటూ క్యాప్షన్ జోడించింద. ఇక ప్రస్తుతం ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. థియేటర్లలో ఒక మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.
ALSO READ:చిక్కుల్లో మోహన్ లాల్ దృశ్యం 3.. విడుదల కష్టమేనా?
ది కేరళ స్టోరీ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. సురేఖ (ఉల్కా గుప్తా), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్య ఓజా) స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వీరిలో కేరళకు చెందిన సురేఖ యూపీఎస్సీకి సిద్ధమవుతూ ఉంటుంది. అటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా రాణించాలని దివ్య కోరిక. నేహా జావెలిన్ థ్రో రాష్ట్రస్థాయి క్రీడలలో రాణిస్తూ జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి మరి ప్రేమించిన వారితో వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది ఈ సినిమా స్టోరీ. మొత్తానికైతే ఈ ముగ్గురు పాత్రల్లో కూడా అమ్మాయిలు చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరి నటించారు . నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.