Adventure Mystery Movie OTT : అమెజాన్ అడవుల్లో ఓ సీక్రెట్ సిటీ ఉందని తెలిస్తే… ఎవరైనా దాన్ని వెతకడానికి ప్రాణాలకు తెగించి అడవిలోకి వెళ్తారా ? బ్రిటిష్ ఎక్స్‌ప్లోరర్ పెర్సీ ఫాసెట్ మాత్రం అదే చేశాడు. ఓ పురాతన నాగరికతకు సంబంధించిన ఆధారాలు కనిపించడంతో, ఆ సిటీని కనిపెట్టాలనే పిచ్చి అతడిని మళ్లీ మళ్లీ అమెజాన్ అడవుల్లోకి తీసుకెళ్లింది. చివరికి తన కొడుకుతో కలిసి వెళ్లిన ఫాసెట్ తిరిగి రాకపోవడంతో ఈ కథ మరింత మిస్టీరియస్ గా మారుతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరే ‘The Lost City of Z’. మరి అసలు కథ ఏంటి ? ఈ ఇంట్రెస్టింగ్ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
పెర్సీ ఫాసెట్ బ్రిటిష్ ఆర్మీలో పని చేస్తుంటాడు. ఓ మ్యాపింగ్ మిషన్ లో భాగంగా అమెజాన్ ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడికి అక్కడి గురించి ఊహించని విషయాలు తెలుస్తాయి. అడవుల్లో ఎప్పుడో ఓ అభివృద్ధి చెందిన నాగరికత ఉండి ఉండొచ్చని కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. అదే ఫాసెట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మిస్టీరియస్ నగరానికి అతడు “Z” అనే పేరు పెడతాడు. దాన్ని కనుక్కోవాలనే పట్టుదలతో మళ్లీ అమెజాన్ కు వెళ్తాడు.
కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా, అతడి అన్వేషణ మాత్రం ఆగదు. ఒకసారి వెళ్లి వచ్చిన తర్వాత కూడా అక్కడే ఏదో పెద్ద రహస్యం ఉందనే నమ్మకం అతడిని వదలదు. అక్కడిదాకా వెళ్ళినా ఆ నగరాన్ని మాత్రం కనుక్కోలేకపోతాడు. చివరికి తన కొడుకు జాక్ కూడా ఈ అన్వేషణలో భాగమవుతాడు. 1925లో తండ్రీకొడుకులు మరోసారి అమెజాన్ లోకి బయలుదేరుతారు. కానీ ఈ ప్రయాణం తర్వాత వాళ్లు తిరిగి రారు.
అసలు వాళ్లకు ఏం జరిగింది ? ఫాసెట్ వెతికిన నగరం నిజంగానే ఉందా ? అతడు చెప్పిన నాగరికత గురించి అప్పట్లో ఎందుకు ఎవరూ నమ్మలేదు ? చివరికి సినిమా ఎలాంటి మలుపు తిరిగింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాపై వెంటనే ఒక లుక్కేయండి. ఇది రెగ్యులర్ అడ్వెంచర్ మూవీలా కేవలం అడవులు, యాక్షన్ తో సాగదు. ఒక మనిషికి తన నమ్మకం బలంగా ఉంటే, దాని కోసం ఎంత దూరమైనా వెళ్లగలడనే విషయాన్ని కూడా చూపిస్తుంది.
Also Read : వీడియో గేమ్ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు
‘ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్’కు James Gray దర్శకత్వం వహించారు. ఇందులో Charlie Hunnam పెర్సీ ఫాసెట్‌గా, Robert Pattinson హెన్రీ కాస్టిన్‌గా, Sienna Miller నినా ఫాసెట్‌గా, Tom Holland జాక్ ఫాసెట్ గా నటించారు. ఇది 2016లో New York Film Festivalలో ప్రీమియర్ అయి, 2017లో థియేట్రికల్ గా విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉంది.