OTT Movie : బొమ్మల్లో దెయ్యాలను చూపించి, రచ్చ రచ్చ చేస్తుంటారు దర్శకులు. ఇటువంటి సినిమాలను చూడటానికి పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా సినిమాలలో బొమ్మలను మెయిన్ రోల్ లో పెట్టి సినిమాలు తీశారు. ఇవి మంచి హిట్స్ కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక కోతి బొమ్మ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆ బొమ్మ సౌండ్ చేసినప్పుడల్లా మనుషుల ప్రాణాలు పైకి పోతుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘ది మంకీ’ (The Monkey). 2025 లో వచ్చిన ఈ మూవీకి ఓస్ గుడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించారు. 1980 లో స్టీఫెన్ కింగ్ రాసిన కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో థియో, జేమ్స్ కవల సోదరులుగా నటించారు. వారి చుట్టూ భయంకరమైన మరణాలకు కారణమయ్యే ఒక కోతి బొమ్మ ఉంటుంది. దీని వల్ల వీరి జీవితాలు తలకిందులు అవుతాయి. టటియానా మస్లానీ, క్రిస్టియన్ కన్వెరీ, కోలిన్ ఓ’బ్రియన్, రోహన్ కాంప్‌బెల్, సారా లెవీ సహాయక పాత్రల్లో నటించారు. ‘ది మంకీ’ 2025 ఫిబ్రవరి 21న యునైటెడ్ స్టేట్స్ లో థియేటర్ లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కవల సోదరులు అయిన హాల్, బిల్ వాళ్ళ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఆడుకుంటూ తమ తండ్రికి చెందిన ఒక పాత కోతి బొమ్మను కనిపెడతారు. ఈ బొమ్మలో చప్పుడు చేసే సింబల్స్ ఉంటాయి. ఇక్కడే ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఈ బొమ్మ చప్పుడు చేసిన ప్రతిసారీ, భయంకరమైన మరణాలు సంభవిస్తుంటాయి. చిన్నప్పుడు ఈ బొమ్మ వల్ల జరిగిన సంఘటనలను పెద్దయ్యాక గుర్తు చేసుకుని… హాల్, బిల్, దాన్ని నాశనం చేయాలని అనుకుంటారు.
అయితే కొన్ని సంవత్సరాలు వీళ్ళు విడిపోయి, ఒకరికొకరు దూరమై ఉంటారు. ఈ బొమ్మ మళ్లీ కనిపించి, కొత్త వ్యక్తులను చంపుతూ ఉంటుంది. దీనిని అంతం చేయడానికి, కవల సోదరులు మళ్లీ కలిసి ప్లాన్ చేస్తారు. చివరికి ఆ మంకీ బొమ్మను ఈ సోదరులు అంతం చేస్తారా ? ఆ బొమ్మ వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయి ? ఆ బొమ్మలో ఉన్న దుష్ట శక్తి ఏమిటి ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా