OTT Movie : రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఓటిటిలో, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు గా పేరు తెచ్చుకున్నాయి. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. కొన్ని సీన్స్ కోసం కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయి ఇద్దరితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత స్టోరీ పూర్తిగా మారిపోతుంది. ఈ మూవీ చివరి వరకు, బో*ల్డ్ సీన్స్ తో పిచ్చెఎక్కిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో
ఈ పోలిష్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది నెక్స్ట్ 365 డేస్’ (The Next 365 Days) . 2022లో వచ్చిన ఈ సినిమాకి బార్బరా బియాలోవ్స్, టోమాజ్ మాండెస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాంకా లిపిన్స్కా రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది.’365 డేస్: దిస్ డే’ కి ఈ మూవీ సీక్వెల్ గా వచ్చింది. కథ లారా, మాస్సిమో అనే జంట చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య మూడవ వ్యక్తి రావడంతో అసలు సమస్య మొదలు అవుతుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
లారా, మాస్సిమో మొదటి పార్ట్ లో జరిగిన సంఘటనలను మరచిపోవడానికి ప్రయత్నిస్తూ, కొత్త జీవన శైలిని ఏర్పరచుకుంటారు. కానీ గతంలో జరిగిన సంఘటనలు (లారా గర్భస్రావం, మాస్సిమో మాఫియా జీవనశైలి) వారి మధ్య ఒక అడ్డు గోడగా మారుతాయి. ఇప్పుడు లారా తన కెరీర్‌పై దృష్టి పెడుతూ, ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ను నడుపుతుంది. మరోవపు మాస్సిమో తన మాఫియా వ్యాపారంలో మునిగిపోతాడు. ఈ సమయంలో, నాచో అనే వ్యక్తి లారా జీవితంలోకి తిరిగి ప్రవేసిస్తాడు. గతంలో ఇతనితో నాచోకి పరిచయం ఉంటుంది. అతని సోదరి అమీలియా, లారాను నాచోకు మరో అవకాశం ఇవ్వమని అడుగుతుంది. అతను తన తండ్రి పట్ల ప్రేమ కారణంగా, గతంలో తప్పులు చేశాడని చెబుతుంది. లారా ఇప్పుడు మాస్సిమో, నాచో మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ లో చిక్కుకుంటుంది.
లారా తనలో తానే ఒక విచిత్రమైన అనుభూతిలో ఉంటుంది. ఆమెకి మాస్సిమో అప్పుడప్పుడూ చూపించే తీవ్రమైన టాక్సిక్ ప్రేమ, నాచో చూపించే సపోర్టివ్ ప్రేమ రెండింటిలో ఏదికావాలో అని ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో, మాస్సిమో తన గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ, లారాను తిరిగి గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అవసరాలను గౌరవించడం నేర్చుకుంటాడు. ఆమెతో ఎక్కువగా రొమాన్స్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఆ తరువాత లారా మాత్రం మాస్సిమోతో కూడా ఒక రోజు పడక పంచుకుంటుంది. చివరికి లారా ఎవరిని ఎంచుకుంటుంది ? ఒకరితో ఏకాంతంగా గడిపి, మరొకరిని ఎంచుకుంటుందా ? ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : తాగిన మత్తులో కూతురని కూడా చూడకుండా … ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ కి ఫ్యూజులు అవుట్