Gundeninda GudiGantalu Today episode April 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు సంజయ్, మౌనికను ఇంటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తాడు. అయితే కారు దిగగానే డబ్బులు మొఖానా కొట్టి సంజయ్ వెళ్లిపోతుంటాడు. కానీ బాలు మాత్రం డబ్బులు అంటే లక్ష్మీదేవి నువ్వు ఎందుకు ఇలా విశ్లేష పోతున్నావ్ రేపు డబ్బులు లేక అడగ తింటావా, నా చెల్లెలు ఇబ్బంది పడాలి ముందు ఆ డబ్బులు తీసి చేతికి ఇవ్వు లేదంటే మాత్రం నీవాళ్ల ముందే నిన్ను కొడతానని వార్నింగ్ ఇస్తాడు.. ఇక సంజయ్ ఏమి చేసేదిలేక కింద పడేసిన డబ్బులను బాలు చేతికి ఇస్తాడు. అప్పుడే సంజయ్ మనుషులలో ఒకరు మాట్లాడాలని సంజయ్ ను పిలుస్తారు.
బాలు మౌనికతో ఒట్టేయించుకొని ఈ దెబ్బ ఎలా తగిలిందని అడుగుతాడు. ఒట్టు వేసుకుని ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్తాను అన్నయ్య.. నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా అని మౌనిక బాలుతో అంటుంది. అది చూసిన సంజయ్ వీడు ఒట్టు వేయించుకుని ఏదో నిజం రాబట్టాలని చూస్తున్నాడు అని మౌనికని వెళ్లి తీసుకొని వస్తాడు. బాలు ఇంటికి వెళ్తాడు. పుస్తెలు చూపించి గొప్పగా చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలు గదిలోకి వెళ్తారు. మీనా మాట నిలబెట్టుకున్నందుకు బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. నా మాటని మీరు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి బాలు బంగారం కొనిస్తే భార్యలు ఇలా సంతోషపడతారా అని అడుగుతారు. బంగారం కొన్నందుకు కాదు బంగారం కన్నా ఎక్కువైనా నా మాటని మీరు నిలబెట్టారు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మీనా అంటుంది. దానికి బాలు నువ్వు నీ బంగారు ఇచ్చినప్పుడు లిస్ట్ రాసావు కదా అందులోంచి పుస్తెలు తీసేయి మిగతా ఒక్కోటి ఒక్కోటిగా మనం కొనేద్దామనేసి బాలు అంటాడు. మిగిలినవి నాకు ఇప్పుడు ఏమి అక్కర్లేదండి పుస్తెలు చాలు అని మీనా అంటుంది. మీ అప్పులు తీరాకే నాకు మిగిలినవి కొనివ్వొచ్చు అని అంటుంది. మీనా మాటలు విన్న బాలు సంతోషపడతాడు. వీరిద్దరి ఎమోషనల్ సీన్ఇవాళ ఎపిసోడ్కి హైలెట్ అవుతుంది.
ఇక రోహిణి పార్లర్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ దిలీప్ నుంచి వస్తుంది. ఏంటి కళ్యాణి నన్ను మర్చిపోయావా నాకు డబ్బులు పంపించలేదు. నా జాబ్ పోవడానికి కారణం నువ్వే అయితే నాకు డబ్బులు ఇవ్వాల్సింది నువ్వే కదా ఈనెల నాకు డబ్బులు ఇవ్వడం నువ్వు మర్చిపోయావా కావాలనే ఇది చేసావు కదా ఈసారి ఈ వాయిస్ నోటు మీ అత్తయ్య గారికి వెళ్తుంది ఆ తర్వాత ఏం చేస్తావో ఎలా మేనేజ్ చేసుకుంటావో అది నీ ఇష్టం అని అందులో ఉంటుంది.
అప్పుడే గదిలోకి వచ్చిన ప్రభావతి ఎవరమ్మా ఆ వాయిస్ పంపించింది మీ అత్తయ్య ఏదో అంటున్నారు అని అడుగుతుంది. మా అత్తయ్య అంటే మీరు కాదండి మా మామయ్య వాళ్ళ భార్యకి మొన్న బాగాలేదు కదా ఆయన హడావిడిగా వెళ్లారు కదా ఆయన కోసమే మెసేజ్ వచ్చింది అని అంటుంది. ఒకసారి మీ మామయ్యకు ఫోన్ చెయ్ అమ్మ ఏదో హడావిడిగా వచ్చి వెళ్ళిపోయాడు నేను ఒకసారి మాట్లాడుతాను అని అడుగుతుంది ప్రభావతి.
ఇక రోహిణి తన నాటకం ఎక్కడ బయట పడుతుందోనని మలేషియాలో నెంబర్స్ చాలా బిజీగా ఉంటాయి ఆంటీ దొరకడం చాలా కష్టమే అని ఏదో ఒక సాకు చెప్పేస్తుంది. ఏంటమ్మా ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నా అక్కడ లైన్లు పనిచేయవు అని ప్రభావతి అంటుంది.. సరే కానీ ఆ మీనాన్ని చూసావా ఎంతగా మురిసిపోతుందో..? నాలుగు గ్రాములు కూడా చేయని పుస్తెలు తన మొగుడు తీసుకొచ్చాడని చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటుంది.
నువ్వేంటి అలా బోసి మెడతో పార్లర్ కి వెళ్తున్నావ్ నేను అగలు ఉన్నాయి కదా మెడలో వేసుకో అనేసి అడుగుతుంది. రోహిణి మాత్రం షాక్ అవుతుంది. ఆ నగలు ఎక్కడున్నాయి అన్నట్లుగా అనుకుంటుంది. ప్రభావతికి పార్లర్లో నగలేసుకుని తిరిగితే బాగోదు కదా ఆంటీ అని అంటుంది. పార్లర్లో నేను ఓనర్ నైనా కూడా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా నగలు వేసుకుని ఉంటే నా పని సులువుగా ఉండదు నాకే చిరాకుగా ఉంటుంది అని అంటుంది. సరే అమ్మ నీ ఇష్టం మనసుకు ఎలాగ జాబ్ వచ్చింది కదా మీరు కూడా ఒక కార్నికొనేసెయ్యండి అప్పుడు ఆ బాలు గాడి నోరుని ముయ్యొచ్చు అని సలహా ఇచ్చి వెళ్తుంది. ఇక మనసుకు రెస్టారెంట్లో ఓనర్ చేత చివాట్లు పడతాయి. మీనా పుస్తెలను తన భర్త చేత్తోనే మెడలో వేయించుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..