E-Paper
Advertisement

Kriti Sanon: ప్రభాస్ మాత్రమే సరైనోడు.. కృతి సనన్ కామెంట్స్ విన్నారా?

Kriti Sanon: ప్రభాస్ మాత్రమే సరైనోడు.. కృతి సనన్ కామెంట్స్ విన్నారా?
Advertisement

Kriti Sanon: కృతి సనన్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత కృతి సనన్(Kriti Sanon) నాగచైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నిరాశపరిచిన ఆది పురుష్..

ఈ రెండు సినిమాల తర్వాత కృతి సనన్ పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కేవలం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రభాస్(Prabhas) తో కలిసి ఆది పురుష్(Aadipurush) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ హీరోలతో పాటు సౌత్ హీరోల సినిమాలలో కూడా నటిస్తున్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ నటుడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ మాత్రమే నా కన్నా హైట్ ఉన్నారు..

Advertisement

కృతి సనన్ చూడటానికి చాలా పొడుగ్గా ఉంటారు ఆమె పక్కన హీరోలుగా నటించాలి అంటే వాళ్లు కూడా ఆరడుగుల ఎత్తు ఉండాల్సిందే కానీ ఈమె దాదాపు పని చేసిన హీరోలు అందరూ కూడా తనకంటే ఎత్తు తక్కువగా ఉన్న వాళ్లేనని తెలిపారు . తనకంటే హైట్ ఉన్న హీరోలతో నటించాను అంటే అది కేవలం ప్రభాస్ తో మాత్రమే అంటూ కృతి సనన్ తెలియజేశారు. ఆయనతో నటించేటప్పుడు తాను చాలా కంఫర్టబుల్ గా సినిమా చేశానని తెలిపారు ఇతర హీరోలతో నటించేటప్పుడు వాళ్లు పొట్టిగా ఉండటం వల్ల తాను కూడా ఫ్లాట్ గా ఉండే చెప్పులు వేసుకునేదాన్ని అలాగే హీరోలు కూడా హైట్ కనిపించేలా షూస్ వాడేవారు అంటూ ఈమె తెలియజేశారు.

మాల్దీవులలో నిశ్చితార్థం..

Advertisement

ప్రభాస్ మాత్రం తనకంటే హైట్ ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదని తెలిపారు.. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆది పురుష్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కృతి సనన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు రహస్యంగా మాల్దీవులలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు కృతి శెట్టి ఖండిస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈమె ధనుష్ తో కలిసి నటించిన “తేరే ఇష్క్ మే” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ప్రభాస్ గురించి ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Varanasi Movie: వారణాసిలో మహేష్ అన్ని పాత్రలలో కనిపించనున్నారా? ఏం చేస్తున్నావ్ జక్కన్న?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×