E-Paper
Advertisement

The Raja Saab: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజా సాబ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన హాట్ స్టార్!

The Raja Saab: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజా సాబ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన హాట్ స్టార్!
Advertisement

The Raja Saab OTT: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ది రాజా సాబ్ (The Raja Saab)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్లలో అభిమానులను పూర్తిగా నిరాశపరిచిన రాజ్యసభ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్(Jio Hot Star) కొనుగోలు చేశారు. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

అదనపు సన్నివేశాలతో రాజా సాబ్ స్ట్రీమింగ్…

ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం కాబోతున్నట్లు జియో హాట్స్టార్ అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా జియో హాట్ స్టార్ ప్రభాస్ (Prabhas)అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇదివరకు కట్ చేసిన సన్నివేశాలను కూడా జత చేసి ప్రసారం చేయబోతున్నట్లు తెలియజేశారు. థియేటర్ వెర్షన్ కంటే అదనంగా ఎడిటింగ్ లో కూడా కట్ చేస్తున్న సన్నివేశాలను ఓటిటిలో ప్రసారం చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో నిరాశపరిచిన రాజా సాబ్..

Advertisement

ఇక ఈ సినిమా థియేటర్లో ముందుగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్లు అన్నింటినీ కూడా తీసేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దీంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా విషయంలో నిరాశ వ్యక్తం చేశారు. ఇలా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో తిరిగి ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్లు అన్నింటిని కూడా జత చేస్తూ థియేటర్లో విడుదల చేశారు. ఇలా థియేటర్ లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ రాలేదని చెప్పాలి. థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా ఈ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ఓటీటీలో మరిన్ని అతను సన్నివేశాలతో విడుదల కాబోతుందని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయిన ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో కనిపించారు. ఇక ప్రభాస్ జోడిగా రిద్ది కుమార్, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

Also Read: Priyanka Chopra: ఆ మూడు నెలలు నరకం చూసా.. కూతురి విషయంలో ప్రియాంక ఎమోషనల్!

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×