E-Paper
Advertisement

The Raja Saab OTT: ఇట్స్ అఫీషియల్.. నెల తిరగకుండానే ఓటీటీలోకి రాజాసాబ్!

The Raja Saab OTT: ఇట్స్ అఫీషియల్.. నెల తిరగకుండానే ఓటీటీలోకి రాజాసాబ్!
Advertisement

The Raja Saab OTT: ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ డైరెక్టర్ మారుతికి సినిమా అవకాశం ఇవ్వడంతో అభిమానులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇలా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే.

జియో హాట్ స్టార్ లో ప్రసారం..

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో డైరెక్టర్ మారుతి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఈ సినిమా కనీసం 300 కోట్లకు కూడా రాబట్టిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు వందల కోట్ల నష్టాలు వచ్చాయని చెప్పాలి. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన రాజా సాబ్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్(Jio Hot Star) ఏకంగా 80 కోట్లకు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారికంగా తెలియజేసింది..

Advertisement

ది రాజా సాబ్ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో అయిన మంచి ఆదరణ సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఎవరైతే థియేటర్లలో చూడటం మిస్ అయి ఉంటారో అలాంటి వారు ఓటీటీలో ఈ సినిమా చూసే వెసులుబాటు కలిగింది. మరి ఇక్కడైనా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని ప్రభాస్ పరువు నిలబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నానమ్మ మనవడి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక ఇందులో ప్రభాస్ జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా మారుతి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో నటించారు.

Advertisement

Also Read: With love Trailer:‘విత్ లవ్’ ట్రైలర్.. హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. అనస్వరతో కలిసి అదరగొట్టాడుగా!

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×