OTT Movie : మలయాళం సినిమాలపై ఓ లుక్ వేయందే, మనసు శాంతించడం లేదు ప్రేక్షకులకి. వీకెండ్ లో అయినా ఈ సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మలయాళం నటుడు షైన్ టామ్ చాకో నటించిన 100వ చిత్రం గురించి చెప్పుకోబోతున్నాం. గత ఏడాది థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, ఓటీటీలో ఈ ఏడాది ఆడియన్స్ ని అలరించింది. ఇందులో వివేకానందన్ (షైన్ టామ్ చాకో) అనే గవర్నమెంట్ ఎంప్లాయీ విచిత్రమైన లైంగిక కోరికలతో మహిళల ఆగ్రహానికి గురవుతాడు. ఆతరువాత కథ ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“వివేకానందన్ వైరలను” (Vivekanandan viralanu) 2024లో విడుదలైన మలయాళ కామెడీ డ్రామా మూవీ. కమల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, స్వసికా విజయ్, గ్రేస్ ఆంటోనీ, మరీనా, జానీ ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించారు. నెడియత్ నసీబ్, పిఎస్ షెల్లీరాజ్ నిర్మించిన ఈ సినిమా, షైన్ టామ్ చాకో 100వ చిత్రంగా, ఐదేళ్ల విరామం తర్వాత కమల్ డైరెక్షన్‌లో వచ్చిన కంబ్యాక్ మూవీగా గుర్తింపు పొందింది. ఈ సినిమా 2024 జనవరి 19న థియేటర్లలో విడుదలై, 2025 ఫిబ్రవరి 7 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ డబ్బింగ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
వివేకానందన్ కొచ్చిలో గవర్నమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, ఇడుక్కి జిల్లాలో తన భార్య సీతారా , ఐదేళ్ల కూతురితో సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ, కొచ్చిలో అతను డయానా అనే యాక్ట్రెస్‌తో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటాడు. సమాజానికి అతను చాలా మంచివాడిగా కనిపిస్తాడు. కానీ సీతారా, డయానాతో అతని ప్రవర్తనలో సాడిస్టిక్, హింసాత్మక లైం*గిక కోరికలు బయటపడతాయి. ఇవి అతని నిజ స్వరూపాన్ని బయట పెడతాయి. ఫస్ట్ హాఫ్‌లో, వివేకానందన్ డబుల్ లైఫ్, సమాజంలో అతడు మాస్క్‌ని బిల్డ్ చేసే తీరు, ఆసక్తికరంగా ఉంటాయి.
సెకండ్ హాఫ్‌లో, డయానా, సీతారా, మరో బాధితురాలు ఐషా కలిసి వివేకానందన్‌ని ఎదిరించేందుకు ప్లాన్ చేస్తారు. వారు అతని హింసాత్మక ప్రవర్తనను వీడియోలో రికార్డ్ చేసి, ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తారు. దీంతో అతని జీవితం అతలాకుతలం అవుతుంది. అతను తన పబ్లిక్ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాధితులు అతని డార్క్ సైడ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తారు. క్లైమాక్స్‌లో వివేకానందన్ తన తప్పిదాలకు సమాజం, కుటుంబం నుంచి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మరి వివేకానందన్ తన తప్పులను తెలుసుకుంటాడా ? మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ