BigTV English

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Brahmamudi serial today Episode: కావ్య రూంలోకి వెళ్లి రాజ్‌ ఎమోషనల్‌ అవుతుంటే కావ్య నిద్ర లేస్తుంది. ఏంటండి ఒక్కరే కూర్చుని ఆలోచిస్తున్నారు. ఓ కడుపులో బిడ్డను నేను ఎలా చూసుకుంటున్నానో అడిగి తెలుసుకుంటున్నావా..? అయినా బిడ్డలు రాగానే భార్యల మీద ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది మీకు అంటూ అడుగుతుంది కావ్య. దీంతో రాజ్‌ బాధగా ఇప్పటికి ఇంకా ప్రాణం పోసుకోని ఆ బిడ్డ మీద మనం అంతలా ప్రేమ పెంచుకోవడం ఎందుకు చెప్పు అంటాడు. దీంతో కావ్య ఏవండి నేనేదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాలనుకుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటి..?  ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం అండి మీరైనా నేనైనా ఎదురుచూస్తుంది దీని కోసమేగా.. అంటుంది.


ఎదురుచూడటంలో తప్పు లేదు కళావతి.. ఈ మధ్య నెల తప్పిన వాళ్లు కూడా మిస్‌ క్యారీ అవుతున్నారు. అందుకే చెప్తున్నాను అప్పుడే ఆ బిడ్డ మీద మనం అంత అటాచ్‌ మెంట్‌ పెంచుకోవడం మంచిది కాదు అంటాడు. దీంతో కావ్య ఏంటండి మీరు అంతా మంచి జరుగుతున్న సమయంలో మీరు అపశకునం మాట్లాడతారు మన బిడ్డకు ఏం కాదు. దీన్ని నేను ప్రాణం పెట్టైనా సరే కాపాడుకుంటాను. లాస్ట్‌ టైం నేను హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు కూడా డాక్టర్‌ అంతా బాగుందనే చెప్పారు.. కాబట్టి మీరు కంగారు పడాల్సిందేమి లేదు అంటుంది. దీంతో కళావతి ఇప్పటివరకు నేను నా ఆవేశంతో నిన్ను చాలా బాధపెట్టాను.. నీకు చాలా దూరంగా వెళ్లిపోయాను అంటుంటే..

ఏవండి.. సంతోషంగా ఉన్న టైంలో ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు.. అసలు ఏమైంది మీకు..? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ నన్ను పూర్తిగా చెప్పనిస్తావా… రేపు ఎప్పుడైనా మన మధ్య మళ్లీ అలాంటి గొడవలు కానీ.. అపార్థాలు కానీ వస్తే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవు కదా..? ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేసినా నన్ను అర్థం చేసుకుంటావు కదా.. ? నా తప్పులను క్షమించి నాతోనే ఉంటావు కదా..? అంటాడు. దీంతో కావ్య బాబోయ్‌ మీకేదో అయింది.. అయినా తెలిసి.. తెలిసి..మీరెందుకు తప్పు చేస్తారు.. అని అడుగుతుంది. ఒకవేశ చేయాల్సి వస్తే.. అనగానే.. అర్థం చేసుకుంటాను.. మీరు ఎన్నోసార్లు నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని డైరెక్టుగా చెప్పినా కూడా నేను వెళ్లిపోలేదు.. అని కావ్య చెప్పగానే.. రాజ్‌ కావ్యను హగ్‌ చేసుకుని ఏడుస్తుంటాడు.


సుభాష్‌, ప్రకాష్‌ రెడీ అయి ఆఫీసుకు వెళ్లడానికి కిందకి రాగానే ఇంద్రాదేవి చూసి మీ ఇద్దరిని చూస్తుంటే.. రామలక్ష్మణుల్లా ఉన్నారు అంటూ సంబరపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఆఫీసుకు వెళ్తున్నామని చెప్తారు. మీ ఇద్దరు వెళ్తున్నారా..? అని అడగ్గానే.. అవును అమ్మా మీ మనవడిని చూశావుగా ఆఫీసుకు వెళ్లమంటే ఎంత గొడవ చేశాడో చూశావు కదా..? అందుకే వాణ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేమిద్దరమే వెళ్తున్నాము అని చెప్తాడు. ఇంతలో రుద్రాణి అంతేలే అన్నయ్యా కన్నారు కదా ఇక తప్పుతుందా..? ఇన్ని రోజులు ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటే ప్రాబ్లం దేశంలోనే ఉందనుకున్నాను. కానీ మనుషుల్లోనే ఉందని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అని రుద్రాణి అనగానే..

అంటే ఏంటే నీ ఉద్దేశం అని ఇంద్రాదేవి అడుగుతుంది. ఏముంది చేస్తా అనే వాళ్లు పని ఇవ్వరు చేయను అనే వాళ్లు లీవ్‌ ఇవ్వరు అయినా మిమ్మల్ని అని ఏం లాభం లేండి.. మా కర్మ అలా ఉంటే.. అయినా మీ అందరూ బాగానే ఉంటారు అన్యాయం జరిగేది నా కొడుక్కి కదా అంటుంది రుద్రాణి. ఇప్పుడు రాహుల్ కు ఏమైంది రుద్రాణి గారు బాగానే ఉన్నాడు కదా అంటుంది అప్పు. ఏంటి రుద్రాణి నిన్న రాజ్‌ వాడికి ఆఫీసు బాధ్యతలు ఇవ్వనన్నాడని ఏడుస్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో స్వప్న కూడా రుద్రాణి తిడుతుంది.

ఇంతకు ముందు కంపెనీ బాధ్యతలు ఇస్తే నీ కొడుకు తప్పుల మీద తప్పులు చేసి కంపెనీని అప్పుల పాలు చేశాడు అనగానే.. రుద్రాణి లోపలికి వెళ్లిపోతుంది. అపర్ణ వెళ్లి హారతి తీసుకొస్తుంది. సుభాష్‌ కు ఇస్తుంది. ఇంతలో హాస్పిటల్‌ కు వెళ్లడానికి రాజ్‌, కావ్య బయటకు వస్తారు. కావ్య కూడా హారతి తీసుకోబోతుంటే.. హారతి ఆరిపోతుంది. దీంతో అందరూ బయపడతారు. ఈరోజు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లొద్దని అపర్ణ బయపడుతుంది.  ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా అయినా ఈరోజు స్పెషలిస్టులు వస్తున్నారు వెళ్లాలి అని చెప్పి రాజ్‌, కావ్య వెళ్లిపోతారు.

తర్వాత కళ్యాణ్‌ రూంలోకి వెళ్లి బాధపడుతుంటే.. అప్పు వచ్చి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది కూచి అక్క ఏంటి బావగారితో అంత హ్యపీగా వెళ్తుంది. అసలు అక్కకు నిజం చెప్పారా..? అని అడుగుతుంది. నిజం చెప్పకుండా ఓన్లీ టెస్టులకు మాత్రమే అని తీసుకెళ్తున్నాడు అని కళ్యాణ్‌ చెప్పగానే.. అప్పు కోపంగా కళ్యాణ్‌ ను తిడుతుంది. మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌, కావ్యను చూస్తూ ఎమోషనల్ అవుతూ.. కావ్యను దగ్గరకు తీసుకుని కిస్‌ చేస్తాడు. తర్వాత డాక్టర్‌ దగ్గరకు వెళ్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×