OTT Movie : ఫాంటసీ వెబ్ సిరీస్ మరో ప్రపంచం లోకి తీసుకెళ్తాయి. ఇందులో ఉండే గ్రాఫిక్స్ కనికట్టు చేసే విధంగానే ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ ఫాంటసీ వెబ్ సిరీస్ లు, ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక శక్తివంతమైన రాజ్యం చుట్టూ తిరుగుతుంది. ఇందులో కొంతమందికి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. వాటి ద్వారా ప్రపంచాన్ని నిర్మించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మూడు సీజన్ లు ఉండే ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో
ఈ అమెరికన్ ఫాంటసీ టెలివిజన్ సిరీస్ పేరు ‘ది వీల్ ఆఫ్ టైమ్’ (The Wheel of Time). ఈ వెబ్ సిరీస్ రాబర్ట్ జోర్డాన్, బ్రాండన్ సాండర్సన్ రాసిన అదే పేరుతో ఉన్న హై ఫాంటసీ నవల ఆధారంగా రూపొందించబడింది. ఎనిమిది ఎపిసోడ్‌లు ఉండే మొదటి సీజన్ నవంబర్ 2021లో ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడింది. సెప్టెంబర్ 2023 లో రెండవ సీజన్ ప్రీమియర్ చేయబడింది. మూడవ సీజన్ మార్చి 2025లో ప్రదర్శించబడింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ప్రసారం అవుతుంది. ఇందులో మాయా శక్తులు, లైట్, డార్క్ మధ్య జరిగే భారీ యుద్ధ సన్నివేశాలు ఒక ఫాంటసీ ప్రపంచంలో జరుగుతాయి.
స్టోరీలోకి వెళితే
ఈ కథ ఒక ఫాంటసీ ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ ‘వన్ పవర్’ అనే మాయా శక్తిని కేవలం కొంతమంది మహిళలు మాత్రమే ఉపయోగించగలరు. ఈ శక్తిని నియంత్రించే మహిళలు ఏస్ సెడై అనే శక్తివంతమైన సంస్థలో భాగంగా ఉంటారు. మోరైన్ అనే మహిళ ఒక ఏస్ సెడై సంస్థలో భాగంగా ఉంటుంది. టూ రివర్స్‌లోని ఎమండ్స్ ఫీల్డ్ అనే గ్రామానికి ఆమె వెళ్తుంది. ఆమె డ్రాగన్ రీబార్న్ అనే ఐదుగురు యువకులను కలుస్తుంది. డ్రాగన్ రీబార్న్ ప్రపంచాన్ని రక్షించవచ్చు లేదా నాశనం చేయవచ్చు అంతటి శక్తి ఉంటుంది. ఇంతలోనే రాక్షసులు ఈ గ్రామంపై దాడి చేస్తాయి. దీంతో మోరైన్ ఈ యువకులను తనతో తీసుకెళ్తుంది. ఈ సీజన్ ప్రపంచ నిర్మాణం, ఏస్ సెడై రాజకీయాల చుట్టూ తిరుగుతుంది.
సీజన్ 2 లో డ్రాగన్ రీబార్న్‌గా రాండ్ గుర్తింపు పొందుతాడు. తన శక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఫోర్సేకెన్ అనే శక్తివంతమైన శత్రువులు అతనిని వెంబడిస్తారు. మోరైన్ తన వన్ పవర్‌ను తాత్కాలికంగా కోల్పోతుంది. దీంతో ఆమె కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. సీన్‌చాన్ దండయాత్రతో ఈ సిరీస్ ముగుస్తుంది. ఇందులో ఒక విదేశీ సామ్రాజ్యం ఏస్ సెడైని బానిసలుగా చేస్తుంది. ఇది భవిష్యత్ లో యుద్ధాలకు దారితీస్తుంది. సీజన్ 3 మార్చి 13, 2025 నుంచి ప్రీమియర్ అయింది. ఈ సీజన్ రాబర్ట్ జోర్డాన్ నవల ‘ది షాడో రైజింగ్’ ఆధారంగా రూపొందించబడింది. ఇది సిరీస్ లోనే ఉత్తమ సీజన్‌గా పేరు తెచ్చుకుంది.
Read Also : ఇది మామూలు బొమ్మ కాదు ప్రాణాలు తీసే కోతి బొమ్మ .. ఇది ఎట్లా సంపుతుందో తెలుసా