Shine Tom Chacko : మలయాళం నటుడు షైన్ టామ్ చాకో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలోను, అటు ఇండస్ట్రీలను హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య ఈయన సినిమాలకన్నా ఎక్కువగా వరుస వివాదాలతో హైలెట్ అవుతున్నాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఆయన ప్రవర్తన నన్ను బాధించింది అని ఆమె ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇంకా రాలేదు కానీ ఇప్పుడు ఈ నటుడు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. షైన్ టామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల అరెస్ట్, బెయిల్ రావడం కూడా చకచకా జరిగాయి. ప్రస్తుతం రెండు వివాదాల్లో చిక్కుకోవడం.. అందులో అవి రెండు కూడా పెద్దవి కావడంతో షైన్ టామ్ కెరీర్ పై మచ్చ పడేసింది. అయితే తాజాగా డ్రెస్ కేసు విచారణలో సంచలన విషయాలను నటుడు బయటపెట్టారు.. పోలీసులు విస్తు పోయే నిజాలను ఆయన బయట పెట్టారని తెలుస్తుంది.. విచారణలో ఆయన ఏం చెప్పారో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన చాకో..
మలయాళ నటుడు షైన్ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం షైన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చేశాయి. తాను డ్రగ్స్ వాడటం నిజమేనని పోలీసుల వద్ద ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతోమంది డ్రగ్స్ వాడుతుంటారని, తననే పోలీసులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగినట్టుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు తాను అడిగినపుడు తెచ్చి ఇచ్చినట్టు, కొన్నిసార్లు సినిమా సెట్స్ లోకి తీసుకు వచ్చారని ఆయన చెప్పడంతో పోలీసులు ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య బ్యాంక్ ఖాతా నుంచి అధిక మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయేమో అని పరిశీలిస్తున్నారు. అయితే భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వడం పై పోలీసులు ఆరా తీస్తున్నారు దాని గురించి చాకో అని అడిగితే నేను అప్పుగా ఇచ్చాడని సాకు చెప్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Also Read : సింగర్ ప్రవస్తి విషయం పై సునీత భర్త సీరియస్.. సునీత క్షమాపణలు..
నటుడు పై లైంగిక ఆరోపణలు..
నటుడు షైన్ టామ్ చాకో పై లైంగిక ఆరోపణల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. నటి విన్సీ అలోషియస్ తనను ఈయన లైంగికంగా వేధించాడని ఫిలిం చాంబర్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ సమస్యపై ఎలాంటి కేసులు పెట్టదలచుకోలేదు. దీన్ని అంతర్గతంగానే పరిష్కరించుకుంటా. ఇండస్ట్రీలో ఒక నటుడు కెరీర్ ను దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. షైన్ టామ్ చాకో ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. కానీ మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ కు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కి తీసుకోను అని ఆమె అన్నారు. ఈ వివాదం నుంచి షైన్ టామ్ బయట పడ్డట్టు అయింది. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. ఈయన మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగులో న్యాచురల్ స్టార్ నటించిన దసరా మూవీలో విలన్ గా చేశాడు.