OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ఓటీటీ లో కొద్దిరోజుల్లోనే దర్శనమిస్తున్నాయి. థియేటర్లలో చూడలేని మూవీ లవర్స్, ఓ టీటీ లో వీటిని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక కోతి బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఈ బొమ్మ వల్ల కొన్ని హత్యలు భయంకరంగా జరుగుతాయి. స్టోరీ చివరివరకూ ఊపిరి తీసుకోకుండా చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లో కి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ హారర్ మూవీ పేరు ‘ది మంకీ’ (The Monkey). 2025 లో వచ్చిన ఈ మూవీకి ఓస్‌గుడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించారు. 1980 లో స్టీఫెన్ కింగ్ రాసిన ఒక చిన్న కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో థియో జేమ్స్, టటియానా మస్లానీ, క్రిస్టియన్ కన్వెరీ, కోలిన్ ఓ’బ్రియన్, రోహన్ కాంప్‌బెల్, సారా లెవీ, ఆడమ్ స్కాట్, ఎలిజా వుడ్ నటించారు.ఈ మూవీని జేమ్స్ వాన్ నిర్మించారు. ‘ది మంకీ’ ఫిబ్రవరి 21, 2025న యునైటెడ్ స్టేట్స్‌లో నియాన్ ద్వారా థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. $10 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $68 మిలియన్లు వసూలు చేసింది. ఇద్దరు అన్న దమ్ములు, ఒక కోతి బొమ్మ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు, ‘Final Destination’ లాంటి చిత్రాలను గుర్తుచేస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఇద్దరు కవల సోదరులు హాల్, బిల్ షెల్‌బర్న్ సరదాగా గడుపుతుంటారు. 1999లో వీరు తమ తండ్రి పాత బొమ్మ మంకీని, ఇంటి సామాన్ల గదిలో కనుగొంటారు. ఈ బొమ్మ అసాధారణమైనది. ఇది దీని డ్రమ్ శబ్దం చేసిన ప్రతిసారీ, దాని చుట్టూ ఉన్న వారిలో, ఎవరో ఒకరు భయంకరమైన మరణాలతో మరణిస్తారు. ఈ బొమ్మ వల్ల సంభవించే వరుస మరణాలు, సోదరుల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో వారు దాన్ని వదిలించుకుని, తమ జీవితాలను విడివిడిగా కొనసాగిస్తారు. 25 సంవత్సరాల తర్వాత, ఈ శాపగ్రస్త బొమ్మ మళ్లీ అలజడిరేపుతుంది. మరోసారి దాని డ్రమ్ శబ్దంతో భయంకరమైన మరణాలను జరిగే టట్టు చేస్తుంది. దీనితో విడిపోయిన సోదరులు హాల్, బిల్ మళ్లీ కలుసుకోవలసి వస్తుంది. వారు ఈ బొమ్మ శాపాన్ని ఎదుర్కొని, దాని వినాశకర ప్రభావాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో పీటీ షెల్‌బర్న్ అనే ఒక వ్యక్తి ఈ బొమ్మను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ దాని శక్తి అతన్ని అడ్డుకుంటుంది. చివరికి ఆకవల సోదరులు ఈ బొమ్మను అడ్డుకుంటారా ? ఇంతకీ ఆ బొమ్మ లో ఉన్న దుష్ట శక్తి ఎవరు ? ఈ విషయాలను తెలుసుకోవాల అంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇది తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో డబ్ చేయబడి, థియేటర్లలో, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
Read ALso : కొడుకు కోసం పడరాని పాట్లు… బట్టలు లేకుండా ఆ పని చేస్తూ…