BigTV English
Advertisement

OTT Movie : అప్పు కట్టలేదని అమ్మాయితో ఆ పని చేసే వడ్డీ వ్యాపారి… చివరికి దయ్యాలను కూడా వదిలిపెట్టకుండా…

OTT Movie : అప్పు కట్టలేదని అమ్మాయితో ఆ పని చేసే వడ్డీ వ్యాపారి… చివరికి దయ్యాలను కూడా వదిలిపెట్టకుండా…

OTT Movie : హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటిలో వచ్చే కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా తరికెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా చాలా ట్విస్ట్ లతో మూవీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtreme) లో

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వైఫ్‘ (The wife). చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ పగ తీర్చుకుంటూ వెళ్తుంది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఇదంతా చేస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

వరుణ్, ఆలియా ఒక కొత్త ఫ్లాట్ తీసుకొని అందులో లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. అయితే అందులో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. మొదట వాటిని తేలికగానే తీసుకుంటారు. ఒకరోజు ఆ ఇంటికి పనిమనిషి తన పాపను తీసుకుని వస్తుంది. అయితే కొద్దిసేపట్లోనే ఆ పాప వాషింగ్ మిషన్ లో చనిపోయి కనిపిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో ఉందని అనుకుంటుంది అలియా. రైమా అనే ఆత్మల గురించి రీసెర్చ్ చేసే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అలియా. ఆమె ఇంటికి వచ్చి పరీక్షించి ఇందులో ఒక ఆత్మ ఉందని చెప్తుంది. ఆ ఆత్మ నీ భర్తని కచ్చితంగా చంపేస్తుందని అలియాతో చెబుతుంది. అప్పటికే వరుణ్ కి విక్రం అనే వ్యక్తి చాలా సార్లు కాల్ చేస్తాడు. చివరికి కాల్ లిఫ్ట్ చేసి, నాకు ఎందుకు చేస్తున్నావని తిడతాడు వరుణ్. అయితే అవతలి వైపు మాట్లాడుతుంది విక్రమ్ కాదని చెప్తాడు. విక్రమ్ జైలు నుంచి విడుదలైన తర్వాత చనిపోయాడని చెప్పి, సారిక నుంచి నీకు ప్రమాదం ఉందని విక్రం చెప్పమన్నారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు అర్థమవుతుంది వరుణ్ కి, సారిక ఆత్మ రూపంలో వచ్చి నన్ను కూడా చంపుతుందని.

నిజానికి సారిక ఒక పల్లెటూరి అమ్మాయి. వరుణ్ తండ్రి అప్పు ఇచ్చిన ఒక కుటుంబానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేస్తాడు. వాళ్లు కేసు పెట్టడంతో సారిక తల్లిని ఆశ్రయిస్తాడు. ఆమె మంత్రగత్తె కావడంతో వరుణ్ తండ్రికి సాయం చేస్తుంది. అయితే దానికి ప్రతిఫలంగా తన కూతురు సారీకను వరుణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని చెబుతుంది. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే సారికను పెళ్లి చేసుకుంటాడు వరుణ్. ఆ తర్వాత తన అన్నయ్య విక్రం ఆమెను ఒకచోట పాడు చేయబోతుంటాడు. ఇది కల్లారా చూసి అలాగే ఉండిపోతాడు వరుణ్. ఈ క్రమంలోనే అక్కడి నుంచి సిటీకి వచ్చేస్తాడు. ఆ తరువాత నుంచి ఊరికి వెళ్లకపోవడంతో తనకేమి తెలియకుండా పోతుంది. ఇప్పుడు సారిక ఆత్మ రూపంలో వచ్చే వెంటాడుతూ ఉంది. చివరికి వరుణ్ కూడా సారికచేతిలో చనిపోతాడా? తన అన్న విక్రం చావుకు కారణం ఎవరు? ఆత్మ చేతలో ఇంకెంత మంది ప్రాణాలు పోతాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీనీ మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Big Stories

×