Hyderabad Kite festival: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నగరాల్లో నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది.. పతంగులు, ముగ్గులు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తుంటారు. పలు రకాల డిజైన్లతో కూడిన పతుంగలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక చాలా మంది పతుంగులు ఎగరవేయడంతో బిజీ అయిపోయారు.
మగువలు ఇంటి ముందు ముగ్గులతో పండుగను జరుపుకుంటుండగా.. యువకులు మాత్రం పతంగులు ఎగురవేస్తూ ఆడి పాడి ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పటు చోట్ల కైట్స్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకొని పతంగులు ఎగురవేస్తారు. మరి కొందరు పతంగులను ఎగురవేస్తుంటే ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. కుటుంబంలో ఇంటిల్లిపాది కైట్స్ ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ మహా నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పతంగుల సందడి మొదలైంది. పలు చోట్ల కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. డీజే హోరు మధ్య భవనాలపై పతంగులు ఎగురవేస్తున్నారు. పోటాపోటీగా యువత కైట్స్ ఎగురవేస్తూ.. సందడి చేస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారులు, చిన్నా పెద్దా ఎవరూ తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తున్నారు. బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డి చిన్న పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో పరేడ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరుగనుంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమవ్వగా.. దాదాపు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. అలాగే 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటారు.
Tirupati SP: తిరుపతి మాకొద్దు బాబోయ్ అంటున్న IAS, IPS ఆఫీసర్స్.. అసలు కారణం ఇదేనా..?
కైట్ ఫెస్టివల్‌కు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, తదితర దేశాలకు చెందిన 50 మంది కైట్ ఫ్లైయర్స్ హాజరుకానున్నారు. అలాగే గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ర్టాలకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ కైట్ ఫెస్టివల్‌ను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు రానున్నారు.