BigTV English

OTT Movie : ఒక్క అమ్మాయి కోసం అరాచకం… మెంటలెక్కించే మంత్రగాడి ట్విస్ట్ లు…

OTT Movie : ఒక్క అమ్మాయి కోసం అరాచకం… మెంటలెక్కించే మంత్రగాడి ట్విస్ట్ లు…

OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. వీటిలో క్రైమ్, ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. సెన్సార్ నిబంధనలు కూడా వీటికి లేకపోవడంతో, రొమాంటిక్ కంటెంట్ తో ఈ సిరీస్ లు పిచ్చెక్కిస్తున్నాయి. ఇందులో రొమాంటిక్ సీన్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫాంటసీ వెబ్ సిరీస్ లో మాన్స్టర్స్ ని వేటాడే విచెర్స్ చుట్టూ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హాలీవుడ్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది విట్చర్’ (The Witcher). దీనికి లారెన్ ష్మిత్ హిస్రిచ్ దర్శకత్వం వహించారు. ఇది పోలిష్ రచయిత ఆండ్రెజ్ సప్కోవ్స్కీ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ‘ది విట్చర్’ గెరాల్ట్ ఆఫ్ రివియా, యెన్నెఫర్ ఆఫ్ వెంగర్‌బర్గ్, ప్రిన్సెస్ సిరి ల జీవితాలను అన్వేషిస్తుంది. ఇందులో హెన్రీ కావిల్, అన్యా చలోత్రా, ఫ్రెయా అలన్ నటించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో కూడిన మొదటి సీజన్ డిసెంబర్ 20, 2019న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఇది ది లాస్ట్ విష్, స్వోర్డ్ ఆఫ్ డెస్టినీ ఆధారంగా రూపొందించబడింది. రెండవ సీజన్, ఎనిమిది ఎపిసోడ్‌లతో, బ్లడ్ ఆఫ్ ఎల్వ్స్ నవల ఆధారంగా రూపొందించి, డిసెంబర్ 17, 2021న విడుదలచేశారు. జూన్ 29, జూలై 27, 2023న రెండు భాగాలుగా విడుదల చేశారు. ఏప్రిల్ 2024లో చివరి సీజన్ రూపుదిద్దుకుంటోంది . ఈ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

భూమి మీద విట్చర్స్ కి మాన్స్టర్స్ కి యుద్ధాలు జరుగుతుంటాయి. విట్చర్స్ మాన్స్టర్స్ ని వేటాడి చంపుతూ ఉంటారు. విట్చర్స్ కి మ్యాజికల్ పవర్స్ కూడా ఉంటాయి. ఇందులో హీరో మాన్స్టర్ హంటర్ గా పేరు తెచ్చుకుంటాడు. ఒక ప్రిన్సెస్ ని చంపడానికి ఇతన్ని ఒక వ్యక్తి నియమించుకుంటాడు. ఆ తర్వాత ఆమె కోసం వెతకడం ప్రారంభిస్తాడు. మరోవైపు సిరి అనే రాని పై మాన్స్టర్స్ యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అతి కష్టం మీద ఆ యుద్ధాన్ని ఆపగలుగుతారు. వీళ్ళకి హీరో కూడా సాయం చేస్తాడు. ఇంతలో హీరో ఎనీఫర్ అనే మహిళతో ప్రేమలో పడతాడు. ఆమె ఒక ప్రమాదంలో చనిపోతుందనుకుంటాడు. అయితే ఆమె బ్రతికే ఉంటుంది. సిరి వెనక చాలా రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు కనిపెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు హీరో. చివరికి విచర్స్ కి, మాన్స్టర్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? వాటిని విట్చర్స్ ఎలా ఎదుర్కొంటారు? అనే విషయాలతో ఈ వెబ్ సిరీస్ ని అద్భుతంగా తెరకెక్కించారు. మీరు కూడా ఈ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×