Gundeninda GudiGantalu Today episode march 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక ఫంక్షన్ కోసం డబ్బులు లెక్కలు వేస్తాడు సత్యం.. అయితే మొత్తం కలిపి 3 లక్షలు అవుతుందని అంటాడు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రభావతి అంటుంది దానికి రవి నేను హోటల్ పెట్టాలని ఆలోచిస్తున్నాను దాని గురించే డబ్బుల కోసం వెతుకుతున్నాను నాన్న నా దగ్గర అంత లేవు అనేసి అంటాడు. శృతి మాత్రం ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అంకుల్ అనేసి అంటుంది. చూశారా ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎందుకు పనికిరారు నా కోడలు చూశారా డబ్బులు అడగగానే డబ్బులు ఇస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడే బాలు వచ్చి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు నా చెల్లెలు పుస్తెలతాడు కోసం నేనే ఇస్తాను అని అంటుంది. 20, 30 వేలు కాదురా రెండున్నర లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అంత విన్నాను నా దగ్గర ఆ డబ్బులున్నాయి నేను అరేంజ్ చేస్తాను అనేసి బాలు అంటాడు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం అని బాలు అంటాడు. ఎవరు ఇవ్వాల్సిన పనిలేదు మొత్తం నేనే సర్దుతాను అని బాలు అంటాడు. మౌనిక ఇంటికి వెళ్లిన సత్యం, ప్రభావతిలకు నీలకంఠం కుటుంబం షాకిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ కూడా ఆ బాలు ఉంటే మేము రాలేమండి ఆ బాలు లేకుండా ఉంటేనే వస్తాము మిరే ఆలోచించుకోండి అని నీలకంఠ మంటాడు. ఇక దానికి ప్రభావతి వాడి చెల్లెలి సంతోషం కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు కదా మీరు వచ్చే టైంకి వాళ్ళ ఇంట్లో ఉండండి అన్నయ్యగారు అని అంటుంది సరే అమ్మ మేము వస్తాము లెండి అని నీలకంఠ మాటిస్తాడు ఇక ప్రభావతి వెళ్తూ వెళ్తూ మొన్న మౌనిక ఇంటికి వచ్చింది మీరు ఆరోజు వచ్చిందే బాగుండేది అల్లుడుగారు అనేసి మౌనిక ను అడ్డంగా ఇరికిస్తుంది.. సత్యం బయటికి వెళ్ళగానే ప్రభావతిని తిడతాడు. బాడీ డబ్బులు ఇచ్చి వాడే ఫంక్షన్ చేయాలని అంత హడావిడి చేస్తుంటే నువ్వు ఇప్పుడు వాడు రాడు అనేసి అంటున్నావు నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావ్ అతను కన్నతల్లివేనా లేదా రాక్షసి అనేసి ప్రభావతిని సత్యం తిడతాడు. మౌనికనే చూసుకుంటున్నావ్ అని ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు.
ఆ తర్వాత సంజు మౌనిక దగ్గరికి వెళ్లి భర్తని ఇంత బాగా బురిడీ కొట్టించి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళొస్తావని అస్సలు అనుకోలేదు నీ దగ్గర ఇన్ని తెలివితేటలు ఉంటాయని అస్సలు అనుకోలేదు కానీ బాగానే తెలివిగా ప్లాన్ చేశావు ఇంత మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అత్త కోడలు కలిసి భర్తలని బలే మోసం చేశారు కదా అని సంజయ్ మౌనిక తిడతాడు. పుట్టింటికి వెళ్లడం మాత్రమేనా ఇంకేమైనా ఇద్దరు కలిసి చేస్తున్నారా అనగానే వెనకలే స్వర్ణం వచ్చి సంజయ్ ని చంప పగలగొడుతుంది.
తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం తప్పేముంది రా అని సంజయ్ ని తిడుతుంది ఇది మా ఇద్దరి విషయం నువ్వెందుకు వచ్చావు ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఏదైనా జోక్యం చేసుకోవాలనుకుంటే ముందు నా చావుని చూస్తావని బెదిరిస్తాడు. వర్ణం వెళ్ళిపోతుంది. ఇక మౌనికను ఇంకొకసారి ఇలా చేయాలని చూస్తే ముందు నువ్వు నీ చావు గురించి మీ అన్న చావు గురించి ఆలోచించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. మీ పుట్టింటి వాళ్ళు 16 రోజులు పండగని గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు కదా ఆ పండగ జరగదు ఆ ఫంక్షన్ జరగదు నువ్వు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు జీవితాంతం వాళ్ళు కుమిలి కుమిలిపోయి ఏడ్చేలా నేను చేస్తానని మౌనికకు సంజయ్ షాక్ ఇస్తాడు.
ప్రభావతి సత్యం ఇంటికి వస్తారు బాలు ఇంతసేపటికి వచ్చారా? మీ వియ్యంకులు ఇంట్లో బంగారు పళ్లెంలో అన్నము వెండి గ్లాసుల్లో పాలు తాగి ఇంకా ఆలస్యంగా వస్తారని అనుకున్నాం కానీ ఇంత తొందరగా వచ్చారు ఏంటి అని అనగానే సత్యం ఆలోచిస్తాడు. ఇదంతా నాకు అనవసరం నాన్న ఇదిగో బట్టలు గాని డబ్బులు ఇస్తాడు ఆ విషయం చెప్పిన తర్వాత సత్యం ఆలోచిస్తాడు. అది మాత్రం బాలుకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలని తొందర పడుతుంది. చెల్లెలు ఫంక్షన్ కోసం బాలు పడుతున్న కష్టం చూసి సత్యం ఫంక్షన్ గురించి విషయాన్ని చెప్పలేక పోతారు.
మీరు అలా మౌనంగా ఉంటే రేపు ఫంక్షన్ పెట్టుకొని దాన్ని ఎలా పంపిస్తామండి మీరు కొంచెమైనా ఆలోచించాలి అటు మౌనిక గురించి మీరు ఆలోచించరా అల్లుడు గురించి ఆలోచించడానికి ప్రభావతి సత్యం ను నిలదీస్తుంది. దానికి సత్యం చెల్లెలి ఫంక్షన్ కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడో చూసావా ఎలా చెప్పాలనుకుంటున్నావు నాకైతే మనసు రావట్లేదని ప్రభావతి అంటాడు. అయినా నాకు ఒక సంగతి అర్థం కాక అడుగుతాను నీకు మౌనిక మనోజ్ లేనా నీ కడుపున పుట్టింది బాలు నీ పేగు తెంచుకొని పుట్టలేదా అని సత్యం అడుగుతాడు.
ఇక మీనా అని పిలిచి ప్రభావతి ఇంట్లో పని ఏమీ లేవు కదా హడావిడిగా వెళ్తున్నావు నీ పూల కొట్టు హడావిడి పక్కన పెడితే మౌనిక ఫంక్షన్ గురించి ఆలోచించు అని అంటుంది. ఈమధ్య పూల కొట్టు పెట్టినప్పటి నుంచి నువ్వు ఇంట్లో పనులు చేయట్లేదు ఎవరు ఏం చెప్పినా ఎదురు తిరుగుతున్నావ్ నీ భర్త నీకు అంత అలసి ఇచ్చాడు కదా అందుకే నువ్వు ఇలా చేస్తున్నావ్ కదా అని ప్రభావతి మీనా అని అడుగుతుంది. నీతో నాకు పని ఏంటి నాకు బంగారం లాంటి ఇద్దరు కోడలు ఉన్నారు వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అని ప్రభావతి అనగానే మీనా షాక్ అవుతుంది.
రేపు మౌనిక ఫంక్షన్ కి ప్రతి పని నువ్వే దగ్గరుండి చేసుకోవాలి ఏదైనా తక్కువైతే నేను నిన్నే అడుగుతాను ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రభావతి మీ నాకు వార్నింగ్ ఇస్తుంది. మీనా అయ్యో నేనెలా చేస్తాను అత్తయ్య మీ బంగారం లాంటి ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి ఏదైనా పనులు ఉంటే అని మీనా సెటైర్ వేస్తుంది. చూశారా దీనికి ఎంత పొగరో అవును ప్రభావతి పొగరేముందు అందులో తను చెప్పింది నిజమే కదా ఫుడ్డుకి సంబంధించినవి క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు ఇంట్లో పనులు డెకరేషన్ వాళ్ళు చూసుకుంటారు ఇక మిగతా పనులు మనం చూసుకుంటాం ఇక మీనా చూసుకోవాల్సిందే చేయాల్సింది ఏముంది అని అంటే ఆడవాళ్ళ సంగతి మీకు తెలియదు మీరు మధ్యలో ఇన్వల్ అవ్వకండి అని ప్రభావతి అంటుంది.
తర్వాత రవి శృతి ప్రభావతి దగ్గరికి వచ్చి మేము ఈ ఫంక్షన్ అయిపోయేంత వరకు శృతి వాళ్ళింట్లో ఉండాలని అనుకుంటున్నాము అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఎందుకురా అంటే శృతి ఆ సంజయ్ గురించి మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఈ డిస్టబెన్స్ ఎందుకులే అని మేము అక్కడికి వెళ్తున్నాము అని అనగానే మీనా సత్యం ఇద్దరూ వాళ్లకి సద్ది చెప్పే ప్రయత్నం చేస్తారు చివరికి వాళ్ళు ఫంక్షన్ లో ఇక్కడే ఉంటామని చెప్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలుకు నిజం చెప్పాలని సత్యం ఆలోచిస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..