E-Paper
Advertisement

OTT Web Series: నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్

OTT Web Series: నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్
Advertisement

OTT Web Series: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో కూడిన సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కోవలోనే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదిలో స్ట్రీమింగ్ అవుతూ ఆడియన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న సరికొత్త సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ (Madam Inspector). బెంగాలీలో ‘బీరాంగన’ (Veerangana) పేరుతో రూపొంది విశేష ఆదరణ పొందిన ఈ సిరీస్, ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. నగరంలో పెళ్లి కూతుర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్న ఒక కిరాతక సైకో కిల్లర్ వేట నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. సీట్ ఎడ్జ్ సస్పెన్స్, ఊహించని మలుపులతో నడిచే ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉండటంతో మన ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అసలు ఆ హత్యల వెనుక దాగిన రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం.

పెళ్లికి సిద్ధమైన మహిళలే హంతకుడి టార్గెట్

కోల్‌కతాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే చిత్రా బసు (సందిప్తా సేన్) ఎంతో నిజాయితీగా తన విధులు నిర్వహిస్తుంటుంది. అయితే పోలీస్ ఉద్యోగం చేయడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. అటు పోలీస్ శాఖలోనూ పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో వరుసగా మహిళలు అనుమానాస్పదంగా మరణిస్తుంటారు. పైకి చూస్తే అవన్నీ ఆత్మహత్యలుగా కనిపించినా, వాటి వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని చిత్రాకు అనుమానం వస్తుంది. కేసును లోతుగా పరిశీలించిన ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మరణించిన మహిళలంతా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నవారే! దీంతో ఈ హత్యల వెనుక ఉన్న సంబంధాన్ని కనిపెట్టేందుకు చిత్రా ప్రత్యేకంగా దర్యాప్తు మొదలుపెడుతుంది.

ఒక్కో హత్య వెనుక ఒక్కో రహస్యం!

Advertisement

దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ చిత్రాకు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్నది తెలుసుకోవడం అంత సులభం కాదని ఆమెకు అర్థమవుతుంది. మరోవైపు ఒక పూల వ్యాపారి చుట్టూ కూడా అనుమానాలు మొదలవుతాయి. ఈ క్రమంలో చిత్రా వ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. ఆమెతో పాటు భర్తపై దాడి జరగడంతో కేసు మరింత తీవ్రంగా మారుతుంది. పోలీసుల అనుమానాలు ఒక వ్యక్తి వైపు మళ్లినా, అతడిపై సరైన ఆధారాలు దొరకవు. చివరకు దర్యాప్తు మరో వృద్ధురాలి వైపు మళ్లుతుంది. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హంతకుడిని పట్టుకోవడానికి చిత్రా ఎలాంటి వ్యూహం రచించింది? చివరికి కిల్లర్ దొరికాడా ? అనేది క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది.

‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ ఓటీటీ వివరాలు ఇవే!

‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ (Madam Inspector) సిరీస్ 2025 జులై 25న బెంగాలీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘హోయ్‌చోయ్’ (Hoichoi) లో ‘బిరంగన’ (Birangana) పేరుతో ఒరిజినల్‌గా రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో, నెట్‌ఫ్లిక్స్ సంస్థ 2026 అక్టోబర్ 17న దీనిని ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ పేరుతో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌కు నిర్ఝర్ మిత్రా (Nirjhar Mitra) దర్శకత్వం వహించగా, నబరుణ్ బోస్ సంగీతం అందించారు. ఇందులో ప్రధాన పాత్ర అయిన ఇన్‌స్పెక్టర్ చిత్రా బసుగా బెంగాలీ నటి సందిప్తా సేన్ (Sandipta Sen) అద్భుతంగా నటించారు. ఆమెతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిరంజన్ మండల్ (Niranjan Mondal) ఒక కీలకమైన మిస్టరీ పాత్రలో కనిపించగా, ప్రతీక్ దత్తా, ఆదిత్య సేన్‌గుప్తా, అనిర్బన్ భట్టాచార్య, భాస్కర్ బెనర్జీ, శ్రేయా భట్టాచార్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్‌తో పాటు మంచి తెలుగు డబ్బింగ్ కూడా ఉండటంతో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు దీనిని బాగా ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

Read Also: చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మాఫియా డాన్… దేశాన్నే గడగడలాడించిన రక్తచరిత్ర

Tags

Related News

Friday OTT Releases : ఓటీటీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఏకంగా 10 స్ట్రీమింగ్..!

పెళ్లయిన కొత్తలోనే రహస్యాల సుడిగుండం… నవ్విస్తూనే ఉత్కంఠ రేపే కన్నడ కామెడీ థ్రిల్లర్

దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

వయసు పైబడిన తండ్రికి తల్లిగా మారిన కూతురు… బాధ్యతలు, భావోద్వేగాల మధ్య నలిగిపోయిన ఆడబిడ్డ కథ

అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ

భర్తకు పిల్లలు పుట్టరని తెలిసినా భార్య ప్రెగ్నెంట్.. మాజీ భార్య ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు

Big Stories

Advertisement
×