E-Paper
Advertisement

రూ.11 కోట్ల లాటరీ అనుకుంటే ఫ్రిజ్ మాత్రమే వచ్చింది.. అత్తారింట్లో పరువు కోసం అల్లుడి తిప్పలు చూస్తే నవ్వులే

రూ.11 కోట్ల లాటరీ అనుకుంటే ఫ్రిజ్ మాత్రమే వచ్చింది.. అత్తారింట్లో పరువు కోసం అల్లుడి తిప్పలు చూస్తే నవ్వులే
Advertisement

Dhindora: Season 2 on OTT: డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భువన్ బామ్ (Bhuvan Bam) మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన సృష్టించిన పాపులర్ కామెడీ వెబ్ సిరీస్ ‘ధిండోరా’ (Dhindora) రెండో సీజన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. మొదటి సీజన్‌లో పరిచయమైన టిటు మామ, బబ్లూ జీ, జానకీ, సమీర్, బంచో వంటి పాత్రలు మరోసారి సందడి చేస్తున్నాయి. ఈసారి టిటు మామ జీవితంలోకి భార్య కవితా మామి కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యామిలీలో రచ్చ మరింత పెరిగింది. అత్తారింట్లో తన పరువు నిలబెట్టుకోవడానికి టిటు మామ చేసే ప్రయత్నాలు ఎలాంటి గందరగోళానికి దారితీశాయో ఈ సీజన్‌లో చూడొచ్చు. ఈ కామెడీ సిరీస్‌ను ఏ ఓటీటీలో చూడవచ్చు? కథేంటో తెలుసుకుందాం.

రూ.11 కోట్ల లాటరీ అనుకుంటే.. చేతికి వచ్చింది ఫ్రిజ్ మాత్రమే

కథలోకి వెళ్తే.. మొదటి సీజన్‌లో రూ.11 కోట్ల లాటరీ తగిలిందని టిటు మామ (భువన్ బామ్), అతడి కుటుంబం తెగ సంబరపడిపోతారు. కానీ చివరికి ఆ లాటరీలో వారికి దక్కేది ఒక ఫ్రిజ్ మాత్రమే. దీంతో టిటు మామ ఆర్థికంగా భారీ నష్టాల్లో కూరుకుపోతాడు. అప్పులు, కుటుంబ సమస్యలతో అతడి జీవితం గందరగోళంగా మారుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడటంతో పాటు అత్తారింట్లో తనపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చుకోవాలని టిటు మామ నిర్ణయించుకుంటాడు. కానీ ఏ పని చేసినా అది సవ్యంగా సాగడం అతడి అలవాటే కాదు కదా! సమస్యను పరిష్కరించడానికి వేసే ప్రతి ప్లాన్ కొత్త చిక్కులకు దారితీస్తుంది. అత్తారింటి వారి ముందు పరువు నిలబెట్టుకోవాలనే అతడి ప్రయత్నాలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీశాయన్నదే ఈ సీజన్‌లో ప్రధాన వినోదం.

కవితా మామి ఎంట్రీతో ఫ్యామిలీలో మరింత రచ్చ

Advertisement

ఈ సీజన్‌లో టిటు మామ భార్య కవితా మామి (సంజీదా షేక్) పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. టిటు మామ ఎన్ని కబుర్లు చెప్పినా, అతడి అసలు స్వభావం తెలిసిన వ్యక్తిగా కవితా మామి అతడికి గట్టి పోటీ ఇస్తుంది. మరోవైపు బబ్లూ జీ, జానకీ, సమీర్, బంచో వంటి పాపులర్ పాత్రలు కూడా తమదైన కామెడీతో సందడి చేస్తాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు అత్తారింటి సంబంధాలు.. వీటి మధ్య టిటు మామ చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. ఈ గందరగోళం నుంచి అతడు బయటపడతాడా? అత్తారింట్లో మళ్లీ గౌరవం సంపాదించుకుంటాడా? అనేది మిగతా ఎపిసోడ్లలో చూడాల్సిందే.

‘ధిండోరా: సీజన్ 2’ ఏ ఓటీటీలో చూడచ్చు ?

ఈ సిరీస్‌లో భువన్ బామ్ టిటు మామతో పాటు బబ్లూ జీ, జానకీ, సమీర్, బంచో విభిన్న పాత్రల్లో కనిపించారు. సంజీదా షేక్ కవితా మామిగా నటించగా, అనూప్ సోని, ఉదిత్ నారాయణ్, ఓరీ (Orry) ప్రత్యేక అతిథి పాత్రల్లో సందడి చేశారు. స్నేహ శెట్టి కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ సీజన్‌ ను రోహిత్ రాజ్, భువన్ బామ్ నిర్మించారు. మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ‘ధిండోరా: సీజన్ 2’ నవంబర్ 20, 2026 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి సీజన్‌ను యూట్యూబ్‌లో చూసిన అభిమానులకు ఈ కొత్త సీజన్ మరోసారి కామెడీ విందును అందిస్తోంది.

Advertisement

Read Also: దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

Tags

Related News

OTT Movie: తాగుబోతు అల్లుడు తెచ్చిన తంటాలు… ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్న కామెడీ డ్రామా

OTT Movie: పిల్లలను జాంబీలుగా మార్చే ఐస్ క్రీమ్… ఓటీటీని అల్లాడిస్తున్న మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ థ్రిల్లర్! డోంట్ మిస్

OTT Movie: అతిగా ఆలోచించడంలో ఆస్కార్ గెలుచుకునే కుర్రాడు… కడుపుబ్బా నవ్వించే సైక్ కామెడీ… నేడు ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్

OTT Web Series: నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్

Friday OTT Releases : ఓటీటీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఏకంగా 10 స్ట్రీమింగ్..!

పెళ్లయిన కొత్తలోనే రహస్యాల సుడిగుండం… నవ్విస్తూనే ఉత్కంఠ రేపే కన్నడ కామెడీ థ్రిల్లర్

దేన్నైనా బంగారంగా మార్చే మాయా నాణెం… క్షుద్ర పూజలతో నిద్రలేచిన దెయ్యాలు.. నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

Big Stories

Advertisement
×