OTT Movie: అందాల భామ అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘క్రేజీ కల్యాణం’ (Crazy Kalyanam) ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో, బలగం వేణు వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నిర్మాతల బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలై కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేసేలా అందుబాటులోకి వచ్చింది. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. పెళ్లి విషయంలో తండ్రి ఆశలు ఒకవైపు.. తన జీవితంపై కూతురికి ఉన్న కలలు మరోవైపు.. వీటి మధ్య జరిగే గందరగోళమే ఈ సినిమా కథ. దీనికి తోడు తాగుడుకు బానిసైన ఓ అల్లుడు చేసే పనులు కుటుంబంలో ఎలాంటి సమస్యలు సృష్టించాయో వినోదాత్మకంగా చూపించారు. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అసలు కథేంటో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే.. పల్లెటూరిలో నివసించే పర్వతాలు (నరేశ్)కు ఇద్దరు కూతుళ్లు. తన అన్న చూసిన సంబంధమని పెద్ద కూతురిని బాలరాజు (తరుణ్ భాస్కర్)కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు. కానీ బాలరాజు తాగుడుకు బానిసై, ఊళ్లో అందినకాడికి అప్పులు చేస్తూ కుటుంబానికి తలనొప్పిగా మారతాడు. అల్లుడి ప్రవర్తనతో పర్వతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) విషయంలో మాత్రం ఎలాంటి పొరపాటు జరగకూడదని నిర్ణయించుకుంటాడు. ఆమెకు మంచి గుణగణాలు, ఆర్థిక స్థిరత్వం ఉన్న అబ్బాయితో పెళ్లి చేయాలని భావిస్తాడు. ఈ క్రమంలో తన అన్న కుటుంబానికి వచ్చిన అమెరికా సంబంధాన్ని తన కూతురి కోసం ప్రయత్నిస్తాడు.
కానీ కీర్తి ఆలోచనలు మరోలా ఉంటాయి. మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్ రాజ్)ను పెళ్లి చేసుకోవాలనేది ఆమె కోరిక. ఉదయ్ చేనేత వృత్తిలో ఉంటాడు. ఈ విషయం తండ్రికి చెప్పినా ఆయన ఒప్పుకోడు. తనకు నచ్చిన సంబంధమే చేసుకోవాలని పట్టుబడతాడు. అటు తండ్రి మాట కాదనలేక, ఇటు తన ప్రేమను వదులుకోలేక కీర్తి సందిగ్ధంలో పడుతుంది. మరోవైపు బాలరాజు చేసే పనులు కూడా ఈ పెళ్లి వ్యవహారంలో కొత్త సమస్యలు సృష్టిస్తుంటాయి. చివరికి కీర్తి తండ్రి తెచ్చిన సంబంధానికి అంగీకరించిందా? తన ప్రేమను గెలిపించుకుందా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల నెరవేరిందా? అనేది సినిమాలో చూడాలి.
ఐఎండీబీలో 9.5 రేటింగ్ టాప్ రేటింగ్ ఉన్న ‘క్రేజీ కల్యాణం’ (Crazy Kalyanam) కామెడీ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కీర్తిగా, తరుణ్ భాస్కర్ బాలరాజుగా, నరేశ్ పర్వతాలుగా నటించగా, అఖిల్ రాజ్ ఉద్దేమరి ఉదయ్ పాత్రలో కీలక పాత్రలు పోషించారు. బద్రప్ప గాజుల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. బూసం జగన్మోహన్ రెడ్డి Arrow Cinemas బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించగా, శ్యామ్ దుపాటి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ రోజు (నవంబర్ 20) నుంచి Ahaలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ