OTT Movie : సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూస్తూ, ఒక రేంజ్ లో థ్రిల్ అవుతారు మూవీ లవర్స్. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్, హారర్ మూవీలో కన్నాఘోరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కొంతమంది సైకోలు, అడవి ప్రాంతంలోకి వచ్చే మనుషులను కిడ్నాప్ చేస్తుంటారు. వాళ్లను పిల్లల్ని కనమని ఘోరంగా టార్చర్ పెట్టి చంపుతుంటారు. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టింబర్ ఫాల్స్‘ (Timber falls). ఈ అమెరికన్ మూవీకి టోనీ గిగ్లియో దర్శకత్వం వహించారు. ఇందులో జోష్ రాండాల్, బ్రియానా బ్రౌన్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక దట్టమైన అడవి ప్రాంతంలో కొంతమంది సైకోలు, అక్కడికి వచ్చే మనుషులను కిడ్నాప్ చేసి చంపుతుంటారు. ఈ క్రమంలో ఒక అమ్మాయిని సిలువ ఆకారం వేసి చిత్రహింసలు పెడుతుంటారు. ఆమె అక్కడినుంచి తప్పించుకొని ఒక లోయ దగ్గరికి వెళుతుంది. అక్కడికి భయంకరమైన సైకో వస్తాడు. వాడి చేతిలో చనిపోయాకంటే, లోయలో పడి చనిపోవడమే బెటర్ అని దూకేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఎంట్రీ అవుతారు. ఈ అడవి ప్రాంతంలో అందాలు చూడటానికి వస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ ని ఎటు వెళ్తే సేఫ్ గా ఉంటుంది అని అడుగుతారు. వాళ్లకు ఆఫీసర్ ఒక మ్యాప్ ఇచ్చి పంపుతాడు. అడవిలోకి వెళ్లిన వీళ్లిద్దరూ ఒక చోట ఏకాంతంగా గడపటానికి ట్రై చేస్తుంటారు. అక్కడికి ఒక పోకిరి గ్యాంగ్ వచ్చి వీళ్ల నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఒకచోట టెంటు వేసుకొని హీరో, హీరోయిన్ సరదాగా గడుపుతారు. అక్కడే ఉన్న ఒక చెరువులో స్నానం చేస్తున్న హీరోయిన్ ని ఆ సైకోలు ఎత్తుకుపోతారు.
హీరోకి మెలకువ వచ్చేసరికి, హీరోయిన్ కనపడకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో హీరో కాలుకి పెద్ద గాయమవుతుంది. అక్కడే ఉండే ఒక మహిళ ఇతన్ని కాపాడుతుంది. అయితే ఆ మహిళ హీరోతో, ఇది ఎంత పవిత్రమైన ప్రదేశం అనుకుంటున్నావు అని అడుగుతుంది. మీరిద్దరూ ఇక్కడికి వచ్చి అటువంటి పనులు చేయటానికి ఎంత ధైర్యం అంటూ అతని మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత అతన్ని హీరోయిన్, ఉండే ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఒక పిల్లాడిని కని ఇవ్వాలని ఇద్దరిని ఒకచోట బంధిస్తారు. చివరికి ఆ సైకోల నుంచి హీరో, హీరోయిన్ బయటపడ్డారా? ఈ సైకోలు అక్కడికి వచ్చిన వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? దీని వెనక ఉన్న స్టోరీ ఏమిటి? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.